News October 13, 2025

‘ఉల్లి’తో రైతుకు మేలు జరగాలంటే?

image

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటారు. కానీ ఆ ఉల్లిని పండించే రైతుకు కన్నీళ్లు తప్పట్లేదు. కిలో ₹5-10 మాత్రమే పలుకుతుండటంతో అన్నదాతలు వాపోతున్నారు. రేటు పడిపోయినా ఇబ్బంది లేకుండా ఉల్లి ఆధారిత పరిశ్రమల ఏర్పాటుతో రైతులకు ప్రయోజనం ఉంటుంది. ఆనియన్ ఫ్లేక్స్, పొడి, పేస్ట్, నూనె, ఊరగాయలు, చట్నీలు తయారుచేసేలా ప్రభుత్వాలు ఆలోచన చేయాలి.
* ప్రతిరోజూ అగ్రికల్చర్ కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

Similar News

News October 13, 2025

ఐ మేకప్ తీయకుండా పడుకుంటున్నారా?

image

రాత్రిళ్లు పడుకొనేముందు మేకప్ తియ్యడం తప్పనిసరి. ముఖ్యంగా ఐమేకప్ తియ్యకపోతే పలు సమస్యలు వస్తాయంటున్నారు చర్మ నిపుణులు. కళ్ల కింద నల్లటి వలయాలు, ఐ ఇన్ఫెక్షన్లు వస్తాయి. అలాగే కనురెప్పలకు వేసే మస్కారా తీయకపోవడం వల్ల కనురెప్పల్లోని నూనె గ్రంథులు మూసుకుపోయి వాటికి తేమ అందదు. వాటి సహజత్వం కోల్పోయి పెళుసుబారి విరిగిపోతాయి. కాబట్టి రాత్రిపూట కళ్లకు వేసుకున్న మేకప్‌ తొలగించడం మంచిదని సూచిస్తున్నారు.

News October 13, 2025

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, WGL, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, RR, HYD, మేడ్చల్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో వానలు పడవచ్చని పేర్కొంది.

News October 13, 2025

కెంటన్ మిల్లర్ అవార్డు సాధించిన మొదటి భారత మహిళ

image

కజిరంగా నేషనల్‌ పార్క్‌ మొదటి మహిళా ఫీల్డ్ డైరెక్టర్‌గా ఉన్న సొనాలి ఘోష్‌ సరికొత్త చరిత్ర సృష్టించారు. తాజాగా ప్రపంచంలోని అత్యున్నత గౌరవాలలో ఒకటైన IUCN కెంటన్ మిల్లర్ అవార్డును పొందారు. వణ్యప్రాణుల సంరక్షణకు గానూ ఆమెకు ఈ అవార్డు వచ్చింది. పూణేలో జన్మించిన సొనాలి వైల్డ్‌లైఫ్‌ సైన్స్‌, ఎన్విరాన్‌మెంట్‌ లా చదివారు. పులులను ట్రాక్‌ చేసే రిమోట్‌ సెన్సింగ్‌ టెక్నాలజీపై పరిశోధించి డాక్టరేట్‌ పొందారు.