News March 20, 2025
ఈసారి ఇంపాక్ట్ రూల్ ఉండాలా? వద్దా?

IPL-2025 ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంపాక్ట్ రూల్‌పై మరోసారి చర్చ జరుగుతోంది. ఈ రూల్ క్రికెట్ స్ఫూర్తిని దెబ్బ తీస్తోందని, ఆల్రౌండర్లకు అన్యాయం జరుగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ రూల్ ప్రవేశపెట్టాక 2023లో ఒకసారి, 2024లో 8 సార్లు 250కిపైగా స్కోర్లు నమోదయ్యాయి. అంతకుముందు ఒకసారి మాత్రమే (2013లో) 250+ నమోదైంది. 2024లో జట్ల రన్‌రేట్ 9.56గా ఉండగా 2022లో 8.54గానే ఉంది. దీనిపై మీ కామెంట్.
Similar News
News March 20, 2025
IPL: ముంబైకి షాక్

IPL: ఆదివారం CSKతో జరిగే తొలి మ్యాచులో ముంబై ఇద్దరు స్టార్ ప్లేయర్లు లేకుండానే బరిలోకి దిగనుంది. బుమ్రా గాయం ఇంకా తగ్గలేదని, కోలుకునేందుకు మరింత సమయం పట్టవచ్చని కోచ్ జయవర్ధనే క్లారిటీ ఇచ్చారు. నిషేధం కారణంగా కెప్టెన్ హార్దిక్ పాండ్య సైతం ఫస్ట్ మ్యాచుకు దూరమయ్యారు. అతడి స్థానంలో సూర్య కెప్టెన్సీ చేయనున్నారు. గత కొన్ని సీజన్లుగా ఫస్ట్ మ్యాచ్ ఓడుతూ వస్తోన్న MI.. ఈ స్టార్లు లేకుండా ఎలా ఆడుతుందో మరి!
News March 20, 2025
నేను బీఆర్ఎస్లోనే ఉన్నా: ట్విస్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే

TG: తాను పార్టీ మారలేదని, బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నట్లు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికీ బీఆర్ఎస్ సభ్యత్వ రుసుము రూ.5వేలు చెల్లిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి కోసం సీఎంను కలిస్తే పార్టీ మారినట్లు ప్రచారం చేస్తున్నారని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్నారు. తనను అనర్హుడిగా ప్రకటించాలన్న విజ్ఞప్తి చెల్లుబాటు కాదని పేర్కొన్నారు.
News March 20, 2025
అమరావతిలో వివిధ కంపెనీలకు భూ కేటాయింపులు

AP: GMO సిఫార్సులతో అమరావతిలో పలు సంస్థలకు ప్రభుత్వం భూములు కేటాయించింది.
* బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్సెస్‌కు 70 ఎకరాలు
* IT టవర్ నిర్మాణానికి L&Tకి 10 ఎకరాలు
* ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌కు 25 ఎకరాలు
* హడ్కో హ్యాబిటేట్ సెంటర్‌కు 8 ఎకరాలు
* ఆస్పత్రి, మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం భూకేటాయింపు
* బడ్జెట్ హోటల్‌కు స్థలం కేటాయించాలని IRCTC ప్రతిపాదన