News August 14, 2024
వరంగల్-హనుమకొండ జిల్లాలను కలపాలా? మీరేమంటారు?

TG: వరంగల్, హనుమకొండ జిల్లాలను ఏకం చేయాలనే డిమాండ్ స్థానికంగా వినిపిస్తోంది. 1200 ఏళ్ల చరిత్ర ఉన్న ఓరుగల్లును 2 ముక్కలు చేశారని మహానగర ఏకీకరణ, పునర్నిర్మాణంపై నిన్న జరిగిన చర్చలో వక్తలు అభిప్రాయపడ్డారు. విభజనతో వరంగల్ తీవ్రంగా అణచివేతకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర జిల్లాలతో సంబంధం లేకుండా వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై సిటీని ఒకే జిల్లాగా మార్చాలని కోరుతున్నారు. దీనిపై మీరేమంటారు?
Similar News
News December 3, 2025
సూతకం అంటే మీకు తెలుసా?

ఓ ఇంట్లో జననం లేదా మరణం జరిగినప్పుడు పాటించే అశుభ్రత కాలాన్ని సూతకం అంటారు. కొత్త జననం జరిగినప్పుడు శిశువుకు, తల్లికి మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులందరికీ శుద్ధి అయ్యే వరకు జనన సతకం ఉంటుంది. అలాగే, కుటుంబంలో ఎవరైనా మరణిస్తే.. వారి ఆత్మ శాంతించే వరకు కొన్ని రోజుల పాటు మరణ సూతకం పాటిస్తారు. ఈ సూతక కాలంలో ఇంటి సభ్యులు దేవాలయాలకు వెళ్లరు. శుభకార్యాలు, పూజలు వంటివి చేయరు.
News December 3, 2025
VHTలో 2 మ్యాచులు ఆడనున్న కోహ్లీ!

విజయ్ హజారే ట్రోఫీలో విరాట్ కోహ్లీ కనీసం 2 మ్యాచులు ఆడే అవకాశం ఉందని క్రీడావర్గాలు తెలిపాయి. DEC 24న ఆంధ్ర, 26న గుజరాత్‌తో జరిగే మ్యాచుల్లో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించనున్నారని పేర్కొన్నాయి. ఈ 2 మ్యాచ్‌లకూ బెంగళూరు వేదిక కానున్నట్లు వెల్లడించాయి. విరాట్ చివరిసారి 2010 ఫిబ్రవరిలో VHTలో ఆడారు. తాజా సీజన్‌లో మరోసారి ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తారని ఇప్పటికే ఆ రాష్ట్ర క్రికెట్ బోర్డ్ వెల్లడించింది.
News December 3, 2025
తులసి కోట వద్ద నిత్య దీపారాధన ఎందుకు చేయాలి?

తులసి కోట వద్ద నిత్యం దీపం వెలిగించాలని పండితులు సూచిస్తున్నారు. ఫలితంగా ఇంటి నిండా సానుకూల శక్తి ప్రవహిస్తుందని చెబుతున్నారు. ఈ దీపం మన పరిసరాలను శుద్ధి చేసి మనలో పాజిటివ్ ఆలోచనలు కలిగేలా చేస్తుందని అంటున్నారు. ‘లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. కుటుంబ సభ్యులందరూ ప్రశాంతంగా ఉంటారు. సంపద, శ్రేయస్సు, అదృష్టం పెరిగే యోగం కూడా ఉంటుంది’ అని వివరిస్తున్నారు.


