News January 6, 2025
తెల్లారే పెన్షన్లు ఇవ్వాలా?: వెంకట్రామిరెడ్డి

AP: రాష్ట్రంలో తెల్లారే పెన్షన్లు ఇవ్వకపోతే ప్రపంచం తలకిందులవుతుందా అని రాష్ట్ర గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగులకు అనుకూల వాతావరణం అంటే ఇదేనా? అని నిలదీశారు. వేరే ఊరిలో ఉన్న మహిళా ఉద్యోగి పెన్షన్లు ఇవ్వడానికి ఎన్నిగంటలకు నిద్రలేచి రావాలో గమనించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా IR, పెండింగ్ డీఏల్లో ఒకటైనా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Similar News
News November 28, 2025
MDK: అన్నా నేను తాగుత లేనన్నా..!

ఎన్నికలు రావడంతో ఉమ్మడి MDKలో మద్యంప్రియులు జాగ్రత్తలు పడుతున్నారు. నిత్యం సారా, చీప్లిక్కర్ తాగి జేబులు ఖాళీ చేసుకున్న వాళ్లు ఇప్పుడు కొత్తపాట పాడుతున్నారు. ‘అన్నా ఆరోగ్యం బాగుండట్లేదు. డాక్టర్ చీప్లిక్కర్ తాగొద్దన్నారు’ అంటూ పెద్ద మందుకు టెండర్ పెడుతుండటంతో పోటీదారులు ఖంగు తింటున్నారు. నిన్నటి వరకు ఏదో ఒకటి తాగిన వాళ్లు ఇప్పుడు టీచర్స్, 100 పైపర్స్ వంటి బ్రాండ్లను డిమాండ్ చేస్తున్నారట.
News November 28, 2025
మిరపలో మొవ్వుకుళ్లు తెగులు లక్షణాలు

మొవ్వుకుళ్లు తెగులు ఆశించిన మిరప మొక్కల చిగుర్లు ఎండిపోతాయి. కాండంపై నల్లని మచ్చలు ఏర్పడి క్రమేణా చారలుగా మారుతాయి. కొన్ని మొక్కల్లో ఆకులపై వలయాలుగా మచ్చలు ఏర్పడి పండుబారి రాలిపోతాయి. మొవ్వుకుళ్లు తెగులు ముఖ్యంగా తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. బెట్టపరిస్థితులలో, అధిక నత్రజని మోతాదు వలన, తామర పురుగుల ఉద్ధృతి ఎక్కువవుతుంది. నీటి ద్వారా ఈ వైరస్ ఇతర మొక్కలకు వ్యాపిస్తుంది
News November 28, 2025
మిరపలో మొవ్వుకుళ్లు తెగులు నివారణ ఎలా?

మిరపలో మొవ్వుకుళ్లు తెగులుకు కారణమయ్యే తామర పురుగు నివారణకు లీటరు నీటికి ఫిప్రోనిల్ 2ml లేదా స్పైనోశాడ్ 0.25ml లేదా అసిటామిప్రిడ్ 0.2గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3mlలలో ఒక దానిని కలిపి పిచికారీ చేయాలి. గట్లమీద కలుపు మొక్కలు వైరస్లకు స్థావరాలు. వీటిని పీకి నాశనం చేయాలి. వైరస్ సోకిన మిరప మొక్కలను కాల్చివేయాలి. పొలం చుట్టూ 2 నుండి 3 వరుసల సజ్జ, జొన్న, మొక్కజొన్నను రక్షణ పంటలుగా వేసుకోవాలి.


