News July 20, 2024
అలా అయితే జగన్‌పైనా కేసు పెట్టాలి కదా: మంత్రి

AP: రషీద్ హత్య కేసుపై YS జగన్ వ్యాఖ్యలకు మంత్రి సత్యప్రసాద్ కౌంటరిచ్చారు. ‘నిందితుడు TDP నేతలతో దిగిన ఫొటోలు ఉన్నాయని, వాళ్లపై ఎందుకు కేసు పెట్టలేదని జగన్ అన్నారు. అలా అయితే YCP హయాంలో జరిగిన అత్యాచార నిందితుల్లో సగం మంది జగన్‌తో సెల్ఫీలు దిగారు. వాళ్లతో పాటు జగన్‌పై కూడా రేప్ కేసులు పెట్టాలి కదా? రౌడీషీటర్ PS ఖాన్ అనుచరుడే హంతకుడు జిలానీ. ఆ ఖాన్‌తో కలిసే జగన్ ప్రెస్‌మీట్ పెట్టారు’ అని అన్నారు.
Similar News
News December 24, 2025
ALL SET: 8.54amకు నింగిలోకి..

AP: LVM3-M6 రాకెట్ ప్రయోగానికి తిరుపతి(D) శ్రీహరికోటలోని SDSC సిద్ధమైంది. 8:54amకు USకు చెందిన 6,100KGల బ్లూబర్డ్ బ్లాక్-2 కమ్యూనికేషన్ శాటిలైట్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇది భారత్ నుంచి లోఎర్త్ ఆర్బిట్(LEO)లోకి పంపనున్న అత్యంత బరువైన కమర్షియల్ కమ్యూనికేషన్ ఉపగ్రహం. ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ఫోన్లకు ఇది నేరుగా 4జీ, 5జీ సిగ్నల్స్ అందించి మొబైల్ కనెక్టివిటీని బలోపేతం చేస్తుంది.
News December 24, 2025
ధనుర్మాసం: తొమ్మిదో రోజు కీర్తన

గోదాదేవి సంపదలు గల కన్యను నిద్రలేపుతోంది. రత్నాల మేడలో, హంసతూలికా తల్పంపై నిద్రిస్తున్న తన మేనమామ కూతురితో ‘భగవంతుని నామాలు ఇంతలా స్మరిస్తున్నా నీకు వినబడడం లేదా? గడియ తీయవేమ్మా!’ అని అంటోంది. తన కూతురింకా లేవకపోవడంతో ‘మేనత్తా! నీవైనా లేపు. తను మూగదా? చెవిటిదా? లేక మంత్రం వేసినట్టు ఎందుకు నిద్రపోతోంది?’ అని సరదాగా నిలదీస్తుంది. భగవదనుభవం కోసం అందరూ కలిసి రావాలని ఈ పాశురం చెబుతుంది. <<-se>>#DHANRUMASAM<<>>
News December 24, 2025
ముస్లింలపై దారుణాల గురించి రాయాలని ప్రశ్న.. ప్రొఫెసర్ సస్పెండ్

ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ ప్రొఫెసర్ అడిగిన ఓ ప్రశ్న వివాదానికి దారి తీసింది. ప్రొ.వీరేంద్ర బాలాజీ ‘INDలో ముస్లింలపై జరుగుతున్న దారుణాల గురించి రాయండి’ అని BA సెమిస్టర్ పరీక్షలో ప్రశ్న అడిగారు. ప్రశ్నాపత్రం SMలో వైరల్ కాగా ఇది రాజకీయ, మతపరమైన పక్షపాతంతో రూపొందించిన ప్రశ్న అని వర్సిటీకి ఫిర్యాదులందాయి. కమిటీని ఏర్పాటు చేసిన వర్సిటీ విచారణ పూర్తయ్యే వరకు ఆయన్ను సస్పెండ్ చేసింది.


