News July 4, 2025

వలస కార్మికుల కుటుంబాలకు గౌరవం ఇవ్వరా?: KTR

image

TG: పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో పేలుడు ఘటన భయానకమని మాజీ మంత్రి KTR అన్నారు. ఈ ఘటనలో మృతుల శరీర అవశేషాలను కార్డ్‌బోర్డ్ పెట్టెల్లో తరలిస్తున్నారని ఆరోపించారు. తమవారి ఆచూకీ చెప్పాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారని, శిథిలాల కింద ఎంతమంది ఉన్నారనే దానిపై స్పష్టత లేదని విమర్శించారు. SLBC ఘటనలో పరిహారం కోసం 8 కుటుంబాలు వేచి చూస్తున్నాయని, వలస కార్మికుల కుటుంబాలకు గౌరవం ఇవ్వరా? అని ప్రశ్నించారు.

Similar News

News July 4, 2025

ప్రసిద్ధ్ కృష్ణ చెత్త రికార్డు

image

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ ఇండియా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ చెత్త రికార్డు నమోదు చేశారు. 2006 తర్వాత ఓ టెస్టులో తొలి 5 ఓవర్లలో 10 ERతో 50 రన్స్ ఇచ్చిన భారత బౌలర్‌గా ఆయన నిలిచారు. జేమీ స్మిత్, హ్యారీ బ్రూక్ బజ్ బాల్ ధాటికి ప్రసిద్ధ్ బలైపోయారు. పదే పదే షార్ట్ బంతులు విసిరి తగిన మూల్యం చెల్లించుకున్నారు. ప్రసిద్ధ్ సహా మిగతా బౌలర్లూ పెద్దగా ప్రభావం చూపట్లేదు.

News July 4, 2025

ఈ బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్‌పై ఫైన్ లేదు

image

అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనను ఎత్తివేస్తూ కొన్ని బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. కెనరా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ జులై 1 నుంచి, BOB జులై 2 నుంచి, ఇండియన్ బ్యాంకు జులై 7వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమలు చేస్తున్నట్లు తెలిపాయి. SBI 2020లోనే మినిమమ్ బ్యాలెన్స్‌పై రుసుమును ఎత్తివేసింది. మిగతా బ్యాంకులు సైతం ఇదే పంథాలో ముందుకెళ్లాలని ఖాతాదారులు డిమాండ్ చేస్తున్నారు.

News July 4, 2025

డైరెక్ట్‌గా OTTలోకి వచ్చేసిన కీర్తి సురేశ్ మూవీ

image

కీర్తి సురేశ్, సుహాస్ జంటగా నటించిన సెటైరికల్ కామెడీ డ్రామా ‘ఉప్పు కప్పురంబు’ ఇవాళ డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రసారమవుతోంది. డైరెక్టర్ అని IV శశి తెరకెక్కించిన ఈ మూవీకి స్వీకర్ అగస్తి మ్యూజిక్ అందించారు. ఓ గ్రామంలో ఎదురైన అసాధారణ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొన్నారనేదే సినిమా కథ.