News October 11, 2025

ట్రయల్ ఖైదీలు ఓటు వేయకూడదా: SC ప్రశ్న

image

అండర్ ట్రయల్ ఖైదీలకు ఓటు హక్కు కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో PIL దాఖలైంది. దీన్ని విచారించిన SC కేంద్రం, ఎన్నికల కమిషన్‌ల స్పందన కోరింది. ‘కోర్టులో నేర నిరూపణ జరగనంత వరకూ నిర్దోషే’ అనే న్యాయసూత్రం ప్రకారం విచారణ కేసుల్లో జైళ్లలో గల వారికి ఓటు వేసే అవకాశం కల్పించాలని పిటిషనర్ కోరారు. 2023 లెక్కల ప్రకారం దేశంలోని జైళ్లలో గల 5.3 లక్షల ఖైదీల్లో 3.9 లక్షల మంది కేసుల విచారణ ఎదుర్కొంటున్నవారే.

Similar News

News October 11, 2025

తాజా న్యూస్ రౌండప్

image

✒ ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్ దంపతులు
✒ AP: నెల్లూరు జిల్లా మైపాడు గేటులో స్మార్ట్ స్ట్రీట్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
✒ చిత్తూరు నకిలీ మద్యం తయారీ.. నిందితులకు సీఎం, మంత్రి లోకేశ్‌తో సంబంధాలు: మాజీ మంత్రి కాకాణి
✒ వరంగల్ టెక్స్ టైల్ పార్కులో టీషర్టుల ఉత్పత్తిపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం
✒ హెల్మెట్ ధరించి బైక్ డ్రైవ్ చేయాలన్న సాయి తేజ్.. ఆటో ఎక్స్పో 2015లో మెరిసిన మెగా హీరో

News October 11, 2025

ఏపీకి ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే!

image

AP: ప్రధాని మోదీ ఈనెల 16న 7.50AMకు ఢిల్లీ నుంచి బయల్దేరి 10.20AMకు కర్నూలు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 11.10AMకు రోడ్డుమార్గం ద్వారా శ్రీశైలం వెళ్లి 11.45AMకు మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. 2.30PMకు రాగమయూరి గ్రీన్‌ హిల్స్‌ వెంచర్‌కు శంకుస్థాపన చేస్తారు. 4PMకు బహిరంగ సభలో పాల్గొంటారు. 4.40PMకు కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తారు. అక్కడి నుంచి తిరిగి ఢిల్లీకి తిరుగుపయనం అవుతారు.

News October 11, 2025

విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు

image

AP: విజయవాడ, సింగపూర్ మధ్య నవంబర్ 15 నుంచి ఇండిగో సంస్థ విమాన సర్వీసులను ప్రారంభించనుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వారానికి మూడు రోజులు (మంగళ, గురు, శని వారాల్లో) సర్వీసులు ఉంటాయని వివరించారు. విజయవాడ నుంచి సింగపూర్ ఛాంగీ విమానాశ్రయానికి ఈ సర్వీసులు ఉంటాయని చెప్పారు. భవిష్యత్తులో కోటికి పైగా ప్రవాసాంధ్రులు ప్రయాణించే అవకాశం ఉందన్నారు.