News April 3, 2025
రామానాయుడు స్టూడియోకు షోకాజ్ నోటీసులు

AP: విశాఖలో రామానాయుడు స్టూడియోకు కేటాయించిన 35 ఎకరాల్లో 15.17 ఎకరాలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ భూముల్లో లేఅవుట్లు వేసి విక్రయించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలున్నాయి. ఓ ప్రయోజనం కోసం ప్రభుత్వం ఇచ్చిన భూమిని మిగతా వాటికోసం వినియోగిస్తే రద్దు చేయాలని సుప్రీం తీర్పు ఇచ్చింది. ఆ ప్రకారం స్టూడియోకు షోకాజ్ నోటీసు ఇవ్వాలని రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి సిసోడియా కలెక్టర్ను ఆదేశించారు.
Similar News
News November 23, 2025
కుజ దోష నివారణకు చేయాల్సిన పూజలు

కుజ దోషానికి అంగారకుడు కారణం. ఆయనను పూజిస్తే ఈ దోషం పోతుందని నమ్మకం. ఉజ్జయినీలో శివుడి చెమట నుంచి పుట్టిన అంగారకుడి మంగళనాథ్ ఆలయం ఉంది. ఇక్కడ కుజ దోష నివారణకు పూజలు చేస్తారు. APలో మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ ఆలయాల్లో నిర్వహించే శాంతి పూజలు కుజ దోష నివారణకు ప్రసిద్ధి. మంగళవారం అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే ఈ దోషం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు.
News November 23, 2025
AMPRIలో 20 పోస్టులు

<
News November 23, 2025
ముళ్లు లేని బ్రహ్మజెముడుతో ఎన్నో లాభాలు

సాధారణంగా ముళ్లతో ఉన్న బ్రహ్మజెముడును పశువులు తినవు. మనం వాడటానికి కూడా పనికిరావు. అయితే ICAR అనుబంధ సంస్థ అయిన ‘సెంట్రల్ అరిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ ముళ్లులేని బ్రహ్మజెముడు సాగును ప్రోత్సహిస్తోంది. వీటి సాగుకు కొద్దిగా నీరున్నా చాలు. వీటిని పశువులు ఇష్టంగా తింటాయి. గుజరాత్లో ఈ మొక్క ఫలాలతో పానీయాలు, వీగన్ లెదర్ వస్తువులనూ ఉత్పత్తి చేస్తున్నారు. ఈ మొక్క నాటడానికి రూ.10 ఖర్చవుతుంది.


