News March 17, 2024

జీఎంసీ సూపరింటెండెంట్‌కు షోకాజ్ నోటీసులు

image

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని నగర కమిషనర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. ఆదివారం నగరపాలక సంస్థ ఎన్నికల విభాగాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో విధుల్లో లేని సూపరింటెండెంట్ పద్మకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని మేనేజర్‌ని ఆదేశించారు. ఎన్నికల కోడ్ వచ్చినందున ఎన్నికల విధుల్లో ఎంతో అప్రమత్తంగా ఉండాలని, విధులు సక్రమంగా నిర్వహించాలని ఆమె చెప్పారు.

Similar News

News February 16, 2026

జిల్లాలో 4,71,937 మంది బాలలకు మాత్రలు అందిస్తాం: DMHO

image

జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరాల వయస్సున్న 4,71,937 మంది బాలబాలికలకు మంగళవారం ఆల్బెండజోల్ మాత్రలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.కే విజయలక్ష్మి తెలిపారు. అంగన్వాడీలు, పాఠశాలలు, కళాశాలల ద్వారా మాత్రలు అందిస్తామన్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం మాత్రలు తీసుకోవాలని సూచించారు. 17న తీసుకోని వారు 24న మాప్-అప్ రౌండ్‌లో తప్పక తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

News February 16, 2026

మంగళగిరి: ఘాట్ రోడ్ సమయపాలనలో మార్పులు

image

ఘాట్ రోడ్‌లో ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని కొండ వెనుక ఉన్న ఘాట్ రోడ్ సమయపాలనలో మార్పులు చేసినట్లు దేవస్థాన అధికారి సునీల్ కుమార్ సోమవారం తెలిపారు. అమావాస్య సందర్భంగా మంగళవారం గండాలయ్య స్వామి దర్శనానికి కొండ వెనుక ఘాట్ రోడ్‌లో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే వాహనాలను అనుమతిస్తామన్నారు. కొండపై ప్లాస్టిక్ వస్తువులను నిషేధించామన్నారు. భక్తులు సహకరించాలని కోరారు.

News February 16, 2026

ప్రైవేటు ఆసుపత్రులకు 30 రోజులే గడువు: DMHO

image

జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులు, రక్తపరిక్ష, స్కానింగ్ కేంద్రాలు తమ వైద్యుల HPR IDలు, సంస్థల HFR IDలను డీఎంహెచ్ఓ కార్యాలయంలో నమోదు చేయాలని గుంటూరు DMHO డా.కె.విజయలక్ష్మి తెలిపారు. 30 రోజులలోపు నమోదు పూర్తి చేయని సంస్థల లైసెన్సులు చెల్లనివిగా భావింపబడతాయని హెచ్చరించారు. సందేహాల నివృత్తి కోసం నేరుగా DMHO కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.