News December 4, 2024
సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వీరికి అటెండెన్స్ యాప్ అందుబాటులో ఉండగా సచివాలయానికి వచ్చిన, డ్యూటీ అనంతరం తిరిగి వెళ్లే సమయాల్లో బయోమెట్రిక్ హాజరు వేయాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల మంది గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది వరుసగా 13 రోజులు బయోమెట్రిక్ వేయలేదని ప్రభుత్వం గుర్తించింది. ఇందుకు కారణం తెలపాలని వారందరికీ నోటీసులు జారీ చేసింది.
Similar News
News January 23, 2026
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.5,400 పెరిగి రూ.1,59,710కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.4,950 ఎగబాకి రూ.1,46,400గా ఉంది. కిలో వెండి ధర ఏకంగా రూ.20,000 పెరిగి రూ.3,60,000గా నమోదైంది.
News January 23, 2026
తిరుమల అప్‌డేట్.. 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు

తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ మరింత పెరిగింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం 64,571 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 23,634 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.84 కోట్లుగా నమోదైంది.
News January 23, 2026
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆరంభంలో కాస్త తడబడ్డప్పటికీ కాసేపటికే పుంజుకున్నాయి. సెన్సెక్స్ 117 పాయింట్ల లాభంతో 82,425 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 23 పాయింట్లు లాభపడి 25,313 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్-30 సూచీలో TCS, టెక్ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్, HCL టెక్ షేర్లు లాభాల్లో.. ఇండిగో, అదానీ పోర్ట్స్, పవర్‌గ్రిడ్, సన్ ఫార్మా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.


