News September 9, 2024
చెంపదెబ్బ కొట్టిన VROకు షోకాజ్ నోటీసులు

AP: విజయవాడలో వరద బాధితుడిని <<14060791>>చెంపదెబ్బ<<>> కొట్టిన VRO జయలక్ష్మిపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అలాగే వరద సహాయక చర్యల నుంచి తొలగించారు. తమకు ఆహారం, నీళ్లు అందించలేదని నిలదీసిన స్థానికులపై VRO దురుసుగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైన విషయం తెలిసిందే.
Similar News
News October 19, 2025
సైగలతో సుప్రీంలో వాదనలు

న్యాయవాద వృత్తికి మాత్రం వాక్చాతుర్యం చాలా ముఖ్యం. కానీ వినికిడి లోపం ఉన్నప్పటికీ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించి ఔరా అనిపించారు సారా సన్నీ. కేరళకు చెందిన సారాకు ముందు లా కాలేజీలో సీటు దొరకడమే కష్టమైంది. పట్టా అందుకున్న తర్వాత కర్ణాటక బార్కౌన్సిల్లో పేరు నమోదు చేయించుకున్నారు. ప్రస్తుతం జూనియర్ లాయర్గా చేస్తున్న సారా కేసు విచారణలో సైన్లాంగ్వేజ్లో వాదనలు వినిపించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు.
News October 19, 2025
నేడు రాష్ట్రంలో..

✒ సొసైటీ ఫర్ వైబ్రంట్ విజయవాడ ఆధ్వర్యంలో భవానీపురంలోని పున్నమిఘాట్ వద్ద ఈ సాయంత్రం దీపావళి వేడుకలు.. హాజరుకానున్న CM CBN
✒ ఇంద్రకీలాద్రి: ధన త్రయోదశి సందర్భంగా కనకదుర్గమ్మ దేవస్థానంలో 8AMకు మహాలక్ష్మీయాగం
✒ తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల(సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ, పాదపద్మారాధన), అంగ ప్రదక్షిణ టోకెన్ల కోసం ఇవాళ 9AMకు ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ డిప్ ప్రక్రియ ప్రారంభం.. 21వ తేదీ వరకు అవకాశం.
News October 19, 2025
మట్టి ప్రమిదలతోనే ఐశ్వర్యం, ఆరోగ్యం!

దీపావళి రోజున దీపాలు వెలిగించడానికి మట్టి ప్రమిదలను వాడాలని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. ‘మట్టి ప్రమిద మన శరీరానికి సంకేతం. దీన్ని వాడటం ద్వారా దైవశక్తులను ఆకర్షిస్తాం. ఇవి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తాయి. ఆవు పేడతో చేసిన ప్రమిదలను వాడటం కూడా చాలా శుభప్రదం. ఇవి ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతాయి. ఐశ్వర్య లక్ష్మిని ఆకర్షిస్తాయి. కరెంటు దివ్వెలు కాకుండా సహజ ప్రమిదలు వాడాలి’ అని చెబుతున్నారు.