News April 4, 2025
‘ఇంపాక్ట్’ చూపించి SRHను ఓడించాడు

IPL: కోల్‌కతాతో నిన్న జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన హైదరాబాద్‌ను KKR ఇంపాక్ట్ ప్లేయర్ వైభవ్ అరోరా కోలుకోలేని దెబ్బతీశారు. ముగ్గురు విధ్వంసకర ఆటగాళ్లు హెడ్, ఇషాన్ కిషన్, క్లాసెన్ వికెట్లు పడగొట్టి హైదరాబాద్ ఓటమిని శాసించారు. POTM అవార్డు సొంతం చేసుకున్నారు. SRH హ్యాట్రిక్ పరాజయాలను మూటగట్టుకుంది.
Similar News
News April 5, 2025
IPL: ఉత్కంఠపోరులో గెలుపెవరిదంటే..

ముంబైతో జరిగిన ఉత్కంఠ పోరులో LSG విజయం సాధించింది. 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టు బ్యాటర్లలో నమన్ ధీర్(24 బంతుల్లో 46), సూర్యకుమార్(43 బంతుల్లో 67) పోరాడినా ఫలితం లేకపోయింది. LSG బౌలర్లలో శార్దూల్, ఆకాశ్, ఆవేశ్, దిగ్వేశ్ తలో వికెట్ దక్కించుకున్నారు.
News April 4, 2025
ఈ నెల 16 నుంచి స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మె

AP: విశాఖ స్టీల్‌ప్లాంట్ అఖిలపక్ష కార్మిక సంఘాలు మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపునకు నిరసనగా సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నెల 7, 8 తేదీల్లో యాజమాన్యంతో చర్చిస్తామని, సానుకూలంగా స్పందించకపోతే 16 నుంచి విధులు బహిష్కరిస్తామని ప్రకటించాయి. రేపు సాయంత్రం ఫ్యాక్టరీ ఆర్చ్ వద్ద రాస్తారోకో చేస్తామని తెలిపాయి. త్వరలో ఎమ్మెల్యేలు, ఎంపీలకు వినతిపత్రాలు ఇస్తామని పేర్కొన్నాయి.
News April 4, 2025
శ్రీలంకలో అడుగుపెట్టిన మోదీ

ప్రధాని మోదీ థాయ్‌లాండ్ పర్యటన ముగించుకుని శ్రీలంకకు చేరుకున్నారు. ఆయనకు కొలంబో ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. ఈ ద్వీప దేశ అధ్యక్షుడిగా అనుర కుమార దిస్సనాయకే బాధ్యతలు స్వీకరించాక మోదీ అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. 3 రోజుల విజిట్‌లో రక్షణ, ఇంధన, హెల్త్, వాణిజ్య రంగాలపై ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది.