News June 19, 2024
రాహుల్ మోదీతో శ్రద్ధా కపూర్.. రిలేషన్షిప్ నిజమేనా?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ సినీ రచయిత రాహుల్ మోదీతో ప్రేమలో ఉన్నారనే పుకార్ల నడుమ ఆమె షేర్ చేసిన సెల్ఫీ వైరలవుతోంది. ఈ సెల్ఫీతో వీరు తమ మధ్య ఉన్న బంధాన్ని ధ్రువీకరించారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ‘నా హృదయాన్ని మీ వద్దే పెట్టుకోండి, కానీ, నన్ను ప్రశాంతంగా నిద్రపోనివ్వండి’ అని రాహుల్‌ను ట్యాగ్ చేస్తూ ఆమె పోస్ట్ చేయడంతో అభిమానులు సర్‌ప్రైజ్ అయ్యారు.
Similar News
News April 4, 2026
ఔషధాలపై ట్రంప్ టారిఫ్స్.. ఇండియాపై ప్రభావమెంత?

అమెరికా రీసెంట్‌గా కొన్ని పేటెంటెడ్ డ్రగ్స్‌పై 100% టారిఫ్స్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఇండియాపై పెద్దగా ప్రభావం ఉండదని GTRI చెబుతోంది. మన దేశం నుంచి అమెరికాకు వెళ్లేది తక్కువ ధర ఉండే ‘జనరిక్’ మెడిసిన్స్ మాత్రమేనని వివరించింది. మన ఎగుమతుల్లో పేటెంటెడ్ డ్రగ్స్ వాటా తక్కువ కాబట్టి మన ఫార్మా కంపెనీలు సేఫ్ జోన్‌లోనే ఉన్నాయని స్పష్టం చేసింది.
News April 4, 2026
ఇవాళ, రేపు జాగ్రత్త!

AP: రాష్ట్రంలో ఈరోజు, రేపు తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూ.గో జిల్లాల్లో వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. ఇక ఏలూరు, పల్నాడు జిల్లాలపై వడగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. కాగా నిన్న 11 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. మన్యం(D)లోని భామినిలో అత్యధికంగా 41.8 డిగ్రీలు నమోదైంది.
News April 4, 2026
ALERT: ఇవాళ వర్షాలు

ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది.


