News September 13, 2024

సన్‌గ్లాసెస్ ధరించి శ్రేయస్ బ్యాటింగ్.. 7 బంతుల్లో డకౌట్

image

అసలే సెలక్టర్లు కోపంతో ఉన్నారని వార్తలు. దీనికి తోడు ఫామ్‌లేమి. పైగా సన్‌గ్లాసెస్ ధరించి క్రీజులోకి వచ్చారు. ఓ మంచి ఇన్నింగ్స్ ఆడారా అంటే అదీ లేదు. జస్ట్ 7 బంతులాడి డకౌటయ్యారు. దులీప్ ట్రోఫీలో ఇండియా-డి తరఫున శ్రేయస్ అయ్యర్ తాజా ప్రదర్శన తీరిది. ఇంకేముందీ నెటిజన్లు రంగంలోకి దిగి ట్రోలింగ్ మొదలెట్టారు. సైట్ ఇష్యూస్ ఉంటే బ్యాటర్లు కాంటాక్ట్ లెన్సులు, కళ్లద్దాలు పెట్టుకుంటారు గానీ సన్‌గ్లాసెస్ కాదు.

Similar News

News December 4, 2025

ఫిబ్రవరిలో పెళ్లి అని ప్రచారం.. స్పందించిన రష్మిక

image

నటి రష్మిక మందన్న-విజయ్ దేవరకొండ పెళ్లి వార్తలు కొంతకాలంగా వైరల్ అవుతూనే ఉన్నాయి. 2026 ఫిబ్రవరిలో రాజస్థాన్‌లో పెళ్లి జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ‘వివాహాన్ని నేను ధ్రువీకరించను. అలాగని ఖండించను. సమయం వచ్చినప్పుడు మాట్లాడతా. అంతకుమించి ఏమీ చెప్పను’ అని ప్రశాంతంగా సమాధానం ఇచ్చారు.

News December 4, 2025

APPLY NOW: BEMLలో ఉద్యోగాలు

image

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(<>BEML<<>>) 6 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 17 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌కు 42, డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు 45ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.bemlindia.in.

News December 4, 2025

‘హిల్ట్’ లీకేజ్.. ఇద్దరు ఉన్నతాధికారులపై అనుమానం!

image

TG: <<18457165>>హిల్ట్<<>> పాలసీ లీకేజీపై విజిలెన్స్ టీమ్ విచారణ వేగవంతం చేసింది. ఈ లీక్ వెనుక ఇద్దరు ఉన్నతాధికారులు ఉన్నారని అనుమానిస్తోంది. సీఎంఓలోని ఓ అధికారిని నిన్న రాత్రి టీమ్ విచారించినట్లు తెలుస్తోంది. అటు BRSతో పాటు ఓ కీలక బీజేపీ నేతకు కూడా సమాచారం లీక్ అయినట్లు టాక్. ఉన్నతాధికారుల ప్రమేయంపై క్లారిటీ రావాల్సి ఉంది. CM ఈ విషయమై సీరియస్‌గా ఉండటంతో క్లారిటీ వస్తే కారకులకు షోకాజ్ నోటీస్ ఇచ్చే అవకాశముంది.