News April 9, 2025
‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ రేసులో శ్రేయస్ అయ్యర్

టీమ్ ఇండియా యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’కు నామినేట్ అయ్యారు. గత నెలలో అత్యుత్తమ ప్రదర్శనకు సంబంధించి ఐసీసీ ఈ విషయాన్ని ప్రకటించింది. మార్చిలో మూడు మ్యాచులు ఆడిన ఆయన 57.33 సగటుతో 172 రన్స్ చేశారు. అయ్యర్‌తో పాటు న్యూజిలాండ్ స్టార్స్ రచిన్, డఫీ ఉన్నారు. మహిళల క్రికెట్లో జార్జియా వాల్(Aus), సదర్లాండ్(Aus), చేతన ప్రసాద్(UAE) ఉన్నారు.
Similar News
News January 8, 2026
ఆన్లైన్లోనే పొదుపు సంఘాలకు రుణాలు: చంద్రబాబు

AP: పొదుపు సంఘాలు ఆన్లైన్లోనే రుణాలు తీసుకునే సదుపాయం త్వరలో వస్తుందని CM చంద్రబాబు తెలిపారు. బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదని చెప్పారు. 1.13 కోట్ల మంది సభ్యులు పొదుపు సంఘాల ద్వారా రూ.26 వేల కోట్ల నిధిని ఏర్పాటు చేశారని అభినందించారు. గుంటూరులో నిర్వహించిన సరస్ మేళాలో ఆయన మాట్లాడారు. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త రావాలని, MSMEలు పెట్టుకోవాలని సూచించారు.
News January 8, 2026
పేద బ్రాహ్మణుల కోసం ‘గరుడ’ పథకం

AP: పేద బ్రాహ్మణుల కోసం ‘గరుడ’ పేరుతో కొత్త పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. బ్రాహ్మణులు చనిపోతే ఆ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. ఈ స్కీమ్‌తో కష్ట సమయంలో వారికి ఉపశమనం కలుగుతుందని చెప్పారు. దీనిపై ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించినట్లు తెలిపారు. అమరావతి సచివాలయంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చిరాంప్రసాద్‌తో సమావేశమై గరుడ పథకంపై చర్చించారు.
News January 8, 2026
స్పర్శిస్తూ కళను అనుభూతి చెందుతున్నారు!

కళను కళ్లతో చూడడమే కాదు చేతులతో తాకి అనుభూతి చెందవచ్చని నిరూపిస్తోంది జైపూర్‌లోని(RJ) ‘రాజస్థాన్ నేత్రహీన్ కళ్యాణ్ సంఘ్’. St+art ఫౌండేషన్ చేపట్టిన ‘స్పర్శ్’ ప్రాజెక్ట్ ద్వారా అంధ విద్యార్థుల కోసం గోడలపై ‘టాక్టైల్ ఆర్ట్’ను రూపొందించారు. బ్రెయిలీ లిపి, టెక్స్చర్డ్ పెయింట్స్‌తో తీర్చిదిద్దిన ఈ చిత్రాలను స్పర్శిస్తూ అంధ విద్యార్థులు రాజస్థాన్ సంస్కృతిని అనుభూతి చెందుతున్నారు.


