News March 26, 2025
శ్రేయస్ అయ్యర్.. కమ్‌బ్యాక్ సూపర్!

నిన్నటి IPL మ్యాచ్‌లో ప్లేయర్‌గా(97 రన్స్), కెప్టెన్‌గా పంజాబ్ కింగ్స్‌కు శ్రేయస్ అయ్యర్ విజయాన్ని అందించారు. BCCI కాంట్రాక్ట్‌ను కోల్పోయాక ఆయన గత ఏడాది రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ, IPL, ఇరానీ ట్రోఫీలను గెలిచారు. అనంతరం పంజాబ్ రూ.26.75 కోట్లకు వేలంలో కొనుగోలు చేసింది. ఆ వెంటనే ఛాంపియన్స్ ట్రోఫీలోనూ కీలక పాత్ర పోషించారు. దీంతో అయ్యర్.. మీ కమ్‌బ్యాక్ సూపర్ అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి.
Similar News
News November 27, 2025
కరెంట్ షాక్‌తో కడప జిల్లా యువకుడి మృతి

పులివెందులలోని వాసవీ కాలనీలో బుధవారం రాత్రి యువకుడు చైతన్య విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. యువకుడు ఇంటిలో పిండి గ్రైండింగ్ ఆడిస్తుండగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి చనిపోవడంతో ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని పలువురు కోరుతున్నారు.
News November 27, 2025
MTU 1232.. ముంపు ప్రాంత రైతులకు వరం

MTU 1075, స్వర్ణ రకాలతో సంకరణం చేసి MTU 1232ను అభివృద్ధి చేశారు. ఇది మధ్యస్థ సన్నగింజ రకం. నాట్లు వేశాక 14-15 రోజుల వరకు ముంపును తట్టుకోగలదు. పంటకాలం సాధారణంగా 135-140 రోజులు, ముంపునకు గురైతే 140-145 రోజులు. మొక్క ఎత్తు 120 సెం.మీ. అగ్గి తెగులు, దోమపోటు, మాగుడు తెగులును తట్టుకుంటుంది. ఇది సాధారణ భూమిలో ఎకరాకు 40 బస్తాలు, ముంపు ప్రాంతాల్లో ఎకరాకు 30 నుంచి 35 బస్తాల దిగుబడినిస్తుంది.
News November 27, 2025
డెలివరీ తర్వాత ఈ లక్షణాలున్నాయా?

డెలివరీ తర్వాత మహిళల్లో అనేక మార్పులు వస్తాయి. జుట్టు ఎక్కువగా రాలడం, శారీరక మార్పులు, వాపు, మలబద్ధకం, కాళ్లు, పాదాల్లో వాపు వంటి సమస్యలు వస్తాయి. వీటిని తగ్గించాలంటే పోషకాలతో కూడిన సమతులాహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా ఇవి కొన్ని రోజుల్లో తగ్గిపోతాయి. కానీ ఎన్ని రోజులైనా వీటి నుంచి ఉపశమనం లభించకపోతే, అశ్రద్ధ చేయకుండా సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించడం మంచిదని చెబుతున్నారు.


