News November 27, 2024
IPL వేలంలో శ్రేయస్ అయ్యర్ సెంచరీ
IPL 2025 వేలంలో టీమ్ ఇండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ కోసం టోర్నీ చరిత్రలోనే అత్యధిక బిడ్లు దాఖలయ్యాయి. ఆయన కోసం ఫ్రాంచైజీలు ఏకంగా 103 బిడ్లు దాఖలు చేశాయి. కేకేఆర్, డీసీ, పంజాబ్ పోటీ పడడంతో బిడ్ల సంఖ్య సెంచరీ దాటింది. కాగా మెగా వేలంలో అయ్యర్‌ను రూ.26.75 కోట్లతో పంజాబ్ కింగ్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక ధర పలికిన రెండో ఆటగాడిగా ఆయన చరిత్ర సృష్టించారు.
Similar News
News November 27, 2024
సయ్యద్ మోదీ టోర్నీలో రెండో రౌండ్‌కు సింధు, లక్ష్య సేన్
ఢిల్లీలో జరుగుతున్న సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 300 టోర్నీలో పీవీ సింధు, లక్ష్య సేన్ రెండో రౌండ్‌కు ముందంజ వేశారు. భారత షట్లర్ అన్మోల్ ఖార్బ్పై 21-17, 21-15 తేడాతో సింధు, మలేషియా షట్లర్ షోలెహ్ ఐదిల్‌పై 21-12, 21-12 తేడాతో లక్ష్యసేన్ గెలిచారు. రెండేళ్ల విరామం తర్వాత ఈ టోర్నీ ఆడుతున్న సింధు.. తర్వాతి రౌండ్లో మరో భారతీయురాలు ఇరా శర్మను ఎదుర్కోనున్నారు.
News November 27, 2024
గుకేశ్ ఖాతాలో 3వ విజయం
ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ఇండియన్ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ 3వ రౌండ్లో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్(చైనా)ను ఓడించారు. తెల్లపావులతో ఆడిన గుకేశ్ 37 ఎత్తుల్లో గెలుపొందడం గమనార్హం. మొత్తం 14 రౌండ్లు ఉండే ఈ టోర్నీలో మొదట 7.5 పాయింట్లకు చేరుకున్నవారు విజేతవుతారు. ఈ టోర్నీ గెలిస్తే ప్రపంచ ఛాంపియన్షిప్ గెలిచిన అత్యంత పిన్న వయస్కుడిగా గుకేశ్(18) చరిత్ర సృష్టిస్తారు.
News November 27, 2024
చెరువులపై పూర్తి పర్యవేక్షణ మాదే: హైకోర్టు
TG: HYDలోని చెరువుల FTL, బఫర్జోన్లు నిర్ధారించే వరకు వాటిపై పూర్తి పర్యవేక్షణ తమదేనని హైకోర్టు స్పష్టం చేసింది. HMDA పరిధిలో 3,532 చెరువులున్నాయని, 2,793 చెరువులకు ప్రైమరీ నోటిఫికేషన్లు, 530 చెరువులకు ఫైనల్ నోటిఫికేషన్లు పూర్తయినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. నోటిఫికేషన్ల ఖరారుకు 3 నెలల గడువు కోరింది. కాగా గడువు ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు DEC 30లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.