News September 24, 2024
శ్రేయస్ అయ్యర్ కొత్త ఇల్లు బాగా కాస్ట్లీ.. Sq.ftకి ₹55,238

చదరపు అడుగుకి రూ.10 వేలు అంటేనే అమ్మో అంటాం. అలాంటిది ముంబైలోని వర్లీలో క్రికెటర్ శ్రేయస్ అయ్యర్, అతని తల్లి Sq.ftకి ₹55,238 చొప్పున 525 చ.అ ఇంటిని ₹2.90 కోట్లతో కొన్నట్టు జాప్కీ యాక్సెస్ వెల్లడించింది. దీనికి స్టాంప్ డ్యూటీ ₹17.40 లక్షలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు ₹30,000 *శ్రేయస్ అయ్యర్ గతంలో ముంబైలో మాక్రోటెక్ డెవలపర్లతో 48వ ఫ్లోర్లో 2380 Sq.ft ఇంటిని చ.అ.కు ₹49,817 చొప్పున కొనుగోలు చేశారు.
Similar News
News January 29, 2026
OTTలోకి వచ్చేసిన ఛాంపియన్ మూవీ

రోషన్ హీరోగా అనస్వర, అవంతిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఛాంపియన్’ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. గతనెల 25న విడుదలైన ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను స్పప్న దత్ నిర్మాణంలో ప్రదీప్ అద్వైతం తెరకెక్కించారు. సోషల్ మీడియా సెన్సేషన్గా మారిన ‘గిర గిర గింగిరాగిరే’ సాంగ్ ఈ మూవీలోనిదే.
News January 29, 2026
భారీ జీతంతో ఉడిపి కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్లో ఉద్యోగాలు

<
News January 29, 2026
పిల్లల్లో కడుపునొప్పికి కారణాలు

పసిపిల్లల్లో కడుపునొప్పి వివిధ కారణాల వల్ల వస్తుంది. సాధారణంగా వైరస్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు, నులి పురుగులు, కోలిక్ సమస్య వల్ల చిన్నారుల్లో కడుపునొప్పి వస్తుంది. సాధారణంగా ఇవి రెండురోజుల్లో తగ్గిపోతాయి. తగ్గకపోగా విరేచనాలు, వాంతులు కూడా అవుతుంటే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. ఇంట్లో ఉండి నాటు వైద్యాలు చేయడం వల్ల పరిస్థితి ప్రమాదకరంగా మారొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


