News April 13, 2025

శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డ్

image

SRHపై 245 పరుగులు చేసినా PBKS నిన్న ఉప్పల్‌‌లో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఓటమితో పంజాబ్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఓ చెత్త రికార్డ్ మూటగట్టుకున్నారు. మూడు సార్లు 200+ రన్స్ చేసి డిఫెండ్ చేసుకోలేక ఓడిపోయిన కెప్టెన్‌గా చెన్నై కెప్టెన్ ధోనీ సరసన తొలి స్థానంలో నిలిచారు. ఈ లిస్టులో డుప్లెసిస్, ధావన్, శాంసన్, కోహ్లీ సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు. నిన్న 18.3ఓవర్లలోనే SRH 245రన్స్‌ను ఛేజ్ చేసింది.

Similar News

News January 15, 2026

సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటారంటే?

image

సంక్రాంతి రైతుల పండుగ. ఈ పండుగ నాటికి అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం ఇంటికి చేరుతుంది. ఆ సంతోషంలోనే ఈ పండుగ జరుపుకుంటారు. తమకు సహాయం చేసిన పశువులను పూజిస్తారు. కూలీలకు పండిన ధాన్యంలో కొంత ఇస్తారు. గంగిరెద్దులు, హరిదాసులు, జంగాలు అందరూ సంక్రాంతికే కనిపిస్తారు. వారందరికీ ప్రజలు సంతోషంగా దానధర్మాలు చేస్తారు. ప్రజలు ఒకరితో మరొకరు కృతజ్ఞతతో మెలగాలని చాటి చెప్పడమే ఈ పండుగ ఉద్దేశం.

News January 15, 2026

సంక్రాంతి రోజు ఇలా చేస్తే మంచిది!

image

పండగ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలస్నానం చేయాలని పండితుల మాట. ‘కొత్త దుస్తులు ధరించి సూర్యుడిని స్మరించుకోవాలి. పితృదేవతలను ఉద్దేశించి దానాలు చేయాలి. ఇష్టదైవానికి పూజ చేసి నైవేద్యం పెట్టిన తర్వాత పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి. ఉదయం సత్యనారాయణ స్వామి, సూర్యనారాయణుడి వ్రతాలు చేస్తే పుణ్యఫలం దక్కి కోర్కెలు నెరవేరుతాయి. ముఖ్యంగా శక్తిమేర దానం చేస్తే అనేక రెట్ల ఫలితం వస్తుంది’ అని చెబుతున్నారు.

News January 15, 2026

114 రాఫెల్స్‌.. రూ.3.25 లక్షల కోట్ల డీల్‌!

image

భారత రక్షణ రంగంలోనే అతిపెద్ద ఒప్పందానికి రంగం సిద్ధమవుతోంది. ఫ్రాన్స్‌ నుంచి 114 రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు రూ.3.25 లక్షల కోట్ల డీల్‌ను రక్షణ మంత్రిత్వ శాఖ పరిశీలించనుంది. ఈ వారాంతంలో జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒప్పందంలో భాగంగా 30% స్వదేశీ పార్ట్స్‌తోనే ఇండియాలోనే తయారీకి ప్రణాళికలు రూపొందించారు. ఈ డీల్ ఫిక్స్‌ అయితే భారత్‌లో రాఫెల్స్ సంఖ్య 176కు పెరగనుంది.