News March 25, 2025

శ్రేయస్ తన సెంచరీ కోసం చూడొద్దని చెప్పారు: శశాంక్

image

GTతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(97*) సెంచరీ మిస్ అయిన విషయం తెలిసిందే. అయితే మరో ఎండ్‌లో శశాంక్ హిట్టింగ్ చేయడంతో అయ్యర్‌కు స్ట్రైక్ రాలేదు. ఇన్నింగ్స్ తర్వాత శశాంక్ దీనిపై మాట్లాడుతూ.. ‘నా సెంచరీ కోసం చూడొద్దు. నువ్వు షాట్లు ఆడు’ అని శ్రేయస్ తనతో చెప్పారన్నారు. తన వ్యక్తిగత స్కోర్ కోసం కాకుండా జట్టు కోసం ఆలోచించిన కెప్టెన్ అయ్యర్‌ను ఫ్యాన్స్ పొగుడుతున్నారు.

Similar News

News November 19, 2025

కన్నె స్వాములు తప్పక చూడాల్సిన స్థానం

image

శబరిమల యాత్రలో పేరూర్‌తోడు నుంచి 12KM దూరంలో కాళైకట్టి అనే కారడవి ఉంటుంది. నేడు ఇది పచ్చని తోటగా మారింది. ఈ స్థలానికి 2 ప్రాముఖ్యతలున్నాయి. ఓనాడు అయ్యప్ప స్వామి తన సైన్య వృషభాలను ఇక్కడే కట్టేశాడట. మరోనాడు మహిషీ మర్దనం చూడడానికి వచ్చిన పరమేశ్వరుడు తన వృషభ వాహనాన్ని ఇక్కడ బంధించాడట. తొలిసారి యాత్ర చేసే కన్నె స్వాములు ఇక్కడ కొబ్బరికాయలు కొడితే ఈశ్వరుడి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. <<-se>>#AyyappaMala<<>>

News November 19, 2025

భారీ జీతంతో NTPCలో ఉద్యోగాలు

image

ఎన్టీపీసీ లిమిటెడ్ 4 ఎగ్జిక్యూటివ్(<>IBD<<>>) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 2వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ, బీటెక్, పీజీడీఎం, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PwBD, మహిళలకు ఫీజు లేదు. నెలకు రూ.90వేలు జీతం చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://careers.ntpc.co.in/

News November 19, 2025

లొంగిపోయేందుకు సిద్ధమైన హిడ్మా!

image

ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన హిడ్మా నవంబర్ 10న రాసిన ఓ లేఖ వైరల్ అవుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని ఓ లోకల్ జర్నలిస్టుకు ఈ లెటర్ రాసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. ‘జోహార్.. మొత్తం పార్టీ లొంగిపోయేందుకు సిద్ధంగా లేదు. సెక్యూరిటీ రిస్కులతో పాటు చాలా సమస్యలు ఉన్నాయి. మా భద్రతకు హామీ ఇస్తే ఎవరినైనా (లొంగిపోయేందుకు) కలిసేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం లొకేషన్ నిర్ణయించాలి’ అని లేఖలో ఉన్నట్లు పేర్కొంది.