News August 16, 2025

భారత్‌కు వస్తున్న శుభాంశు శుక్లా

image

భారత్ తరఫున అంతరిక్షానికి వెళ్లొచ్చిన తొలి వ్యోమగామి శుభాంశు శుక్లా స్వదేశానికి వస్తున్నారు. ఇన్నిరోజులు అమెరికాలోని NASA పర్యవేక్షణలో ఉన్న ఆయన భారత్‌కు పయనమయ్యారు. ఇక్కడికి వచ్చాక ప్రధాని మోదీతో శుక్లా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇక యాక్సియం-4 మిషన్ కోసం ఇన్నాళ్లు కుటుంబం, స్నేహితులకు దూరంగా ఉండటం బాధించిందని ఆయన తెలిపారు. వారిని కలిసి తన అనుభవాలను పంచుకునేందుకు ఆత్రుతగా ఉన్నట్లు వెల్లడించారు.

Similar News

News August 16, 2025

INDIA MAP: రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలిలా

image

కేంద్రం విధించే ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్రాల వ్యాట్, రవాణా ఖర్చులు, డీలర్ కమీషన్‌తో పెట్రోల్ ధరలు అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా ఉండవు. వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్ ధరల వివరాలు తెలిపే మ్యాప్ వైరలవుతోంది. ఇందులో అత్యధికంగా APలో ₹109.5, TGలో ₹107.46 ఉన్నాయి. అలాగే అత్యల్పంగా అండమాన్ నికోబార్ దీవుల్లో ₹82.46గా ఉంది. గతంలో BJP పాలిత రాష్ట్రాల్లో వ్యాట్ తగ్గించడం వల్ల అక్కడి ధరల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది.

News August 16, 2025

BIG ALERT.. రేపు అత్యంత భారీ వర్షాలు

image

TG: రేపు కొత్తగూడెం, హనుమకొండ, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD రెడ్ అలర్ట్ ప్రకటించింది. సూర్యాపేట, సిద్దిపేట, PDPL, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఖమ్మం, BHPL, జనగాం, ADBలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రోడ్లపై ఇబ్బందులు, ఇంజినీరింగ్ సమస్యలు తలెత్తితే 040-3517-4352 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించింది.

News August 16, 2025

‘మార్వాడీ గో బ్యాక్’ అంటూ ఆందోళన.. మీ కామెంట్?

image

TG: <<17419574>>మార్వాడీలు<<>> వ్యాపారం చేయడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. వాళ్లు వేగంగా విస్తరిస్తూ తమ పొట్ట కొడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. ‘మార్వాడీ గో బ్యాక్’ అని నినదిస్తున్నారు. అయితే దేశంలో ఎక్కడైనా నివసించే, వ్యాపారం చేసుకునే హక్కు రాజ్యాంగం కల్పించిందని మరికొందరు గుర్తు చేస్తున్నారు. క్వాలిటీతో పాటు మంచి సర్వీస్ అందిస్తే ఎవరికైనా లాభాలు వస్తాయంటున్నారు. దీనిపై మీ కామెంట్?