News October 7, 2024
నోర్మూసుకుని కూర్చో: కమెడియన్‌తో ఓలా సీఈఓ

ఓలా బైక్స్‌ను విమర్శిస్తూ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన ట్వీట్‌పై ఆ సంస్థ సీఈఓ భవీశ్ అగర్వాల్ మండిపడ్డారు. అంత బాధగా ఉంటే వచ్చి హెల్ప్ చేయాలని సూచించారు. ‘వచ్చి మాకు సాయం చేయండి. మీ పెయిడ్ ట్వీట్ లేదా మీ విఫల కెరీర్ వల్ల మీకొచ్చేదాని కంటే ఎక్కువ జీతం ఇస్తా. లేదంటే నోర్మూసుకుని కూర్చోండి. నిజమైన వినియోగదారుల కోసం సమస్యల్ని సరిచేయనివ్వండి. మా సేవల్ని మరింత విస్తరిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
Similar News
News November 23, 2025
వాన్ Vs వసీం.. ఈసారి షారుఖ్ మూవీ పోస్టర్‌తో!

యాషెస్ తొలి టెస్టులో ENG ఓటమితో ఆ జట్టు మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్‌ను భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ట్రోల్ చేశారు. మ్యాచ్ 2వ రోజు ENG ఆధిపత్యం చెలాయిస్తుందని వాన్ చెప్పారు. కానీ హెడ్ చెలరేగడంతో AUS గెలిచింది. దీంతో వసీం ‘కభీ ఖుషీ కభీ ఘమ్’ ఫొటో పోస్ట్ చేసి ‘Hope you’re okay @michaelvaughan’ అని పేర్కొన్నారు. గతంలోనూ IND, ENG మ్యాచుల సందర్భంలో పుష్ప, జవాన్ మీమ్స్‌తో వసీం ట్రోల్ చేశారు.
News November 23, 2025
పిల్లల్లో ఆటిజం ఉందా? ఇలా చేయండి

ఆటిజమ్ పిల్లలు పెద్దయ్యాక ఎలా ఉంటారన్నది వారికి లభించే ప్రోత్సాహాన్ని బట్టి ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. కొందరు చిన్నారుల్లో సంగీతం, కంప్యూటర్లు, బొమ్మలు వేయటం వంటి నైపుణ్యం ఉంటుంది. అందువల్ల వీరిలో దాగిన నైపుణ్యాన్ని వెలికి తీయటానికి, మరింత సాన బెట్టటానికి ప్రయత్నం చేయాలని చెబుతున్నారు. అలాగే వీరిలో సమన్వయం, ఏకాగ్రత పెరగటానికి ఆటలు బాగా తోడ్పడతాయంటున్నారు నిపుణులు.
News November 23, 2025
OP సిందూర్‌పై పాక్ ఫేక్ న్యూస్.. తిప్పికొట్టిన ఫ్రెంచ్ నేవీ

ఆపరేషన్ సిందూర్‌పై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న పాకిస్థానీ మీడియాపై ఫ్రెంచ్ నేవీ విమర్శలు గుప్పించింది. మేలో జరిగిన ఘర్షణల్లో భారత రఫేల్ జెట్లను కూల్చి పాక్ వాయుసేన ఆధిపత్యం చెలాయించిందంటూ ఓ ఫ్రెంచ్ ఆఫీసర్ చెప్పినట్లుగా అక్కడి మీడియా రాసుకొచ్చింది. అది అసత్యాలతో కూడిన కల్పిత కథనమని ఫ్రెంచ్ నేవీ పేర్కొంది. ఆ ఆఫీసర్ పేరు కూడా తప్పేనని, అతను ఎలాంటి ప్రకటనా చేయలేదని స్పష్టం చేసింది.


