News October 11, 2025
Shutdown effect: USలో వేలాది మంది ఉద్యోగుల తొలగింపు

US ప్రభుత్వం షట్‌డౌన్ వ్యవహారం తీవ్రంగా మారుతోంది. ట్రంప్ యంత్రాంగం వేలాది మంది ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది. డెమోక్రాట్లపై ఒత్తిడి పెంచేందుకు ఈ చర్యలకు దిగింది. లేఆఫ్‌లు స్టార్ట్ అయ్యాయని వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ రస్సెల్ తెలిపారు. 7 ఏజెన్సీలు 4వేల మందికి పైగా వర్కర్ల తొలగింపును స్టార్ట్ చేసినట్లు సమాచారం. కాగా కొత్త బడ్జెట్‌కు ఆమోదం తెలపకపోవడంతో షట్‌డౌన్ అమల్లోకొచ్చింది.
Similar News
News October 11, 2025
కల్తీ కాఫ్ సిరప్‌లపై US ఆరా

మన దేశంలో 22 మంది పిల్లల మృతికి కారణమైన కల్తీ దగ్గు మందులపై US ఆరా తీసింది. కోల్డ్రిఫ్ సిరప్ అమెరికా సహ ఏ దేశానికీ పంపలేదని US FDAకు CDSCO (IND) తెలిపిందని రాయిటర్స్ పేర్కొంది. పరిమితికి మించి 500 రెట్ల విషపూరితమైన కాఫ్ సిరప్ వల్ల పిల్లలు మరణించారని తెలిపింది. ‘ఆ మందులు USలోకి రాకుండా అప్రమత్తంగా ఉన్నాం. ఇక్కడకి వచ్చే మందులు అత్యున్నత ప్రమాణాలతో ఉండాలని చెప్పాం’ అని FDA పేర్కొన్నట్లు వివరించింది.
News October 11, 2025
బొత్సకు వైసీపీ నుంచే ప్రాణహాని: పల్లా

AP: వైసీపీ ఎమ్మెల్సీ <<17973709>>బొత్స<<>> సత్యనారాయణకు కూటమి నుంచి ఎలాంటి ప్రాణహాని లేదని TDP చీఫ్ పల్లా శ్రీనివాస్ అన్నారు. ఆయనకు సొంత పార్టీ నుంచే ప్రాణహాని ఉండొచ్చని కౌంటర్ ఇచ్చారు. ఈ విషయాన్ని బొత్స చెప్పుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. మండలిలో బొత్స కొంత రాణించే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే జగన్ నుంచి ప్రాణహాని ఉండొచ్చని పేర్కొన్నారు. బొత్స భద్రత కావాలని కోరితే CM నిర్ణయం తీసుకుంటారన్నారు.
News October 11, 2025
విద్యార్థినిపై అత్యాచారం.. వెలుగులోకి సంచలన విషయాలు

ఒడిశా విద్యార్థినిపై <<17976156>>అత్యాచారం <<>> కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఫ్రెండ్‌తో కలిసి బయటకు వెళ్లిన యువతిపై ముగ్గురు గ్యాంగ్ రేప్‌కు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించినట్లు పేర్కొన్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై ఒడిశా సీఎం మోహన్ చరణ్ విచారం వ్యక్తం చేశారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని WB సీఎం మమతను కోరారు.