News November 8, 2024

భారీ జీతంతో SI, కానిస్టేబుల్ ఉద్యోగాలు

image

ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) టెలికమ్యూనికేషన్ విభాగంలో 526 ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 14 వరకు మహిళలు, పురుషులు అప్లై చేసుకోవచ్చు. ఎస్సై పోస్టులకు 20-25 ఏళ్లు, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు 18-25 ఏళ్లు ఉండాలి. ఎస్సైల పే స్కేల్ రూ.35,400-1,12,400, హెడ్ కానిస్టేబుల్ పే స్కేల్ రూ.25,500-81,100గా ఉంది. <>సైట్<<>>: recruitment.itbpolice.nic.in

Similar News

News January 25, 2026

అమరావతికి చట్టబద్ధతే లక్ష్యం.. ఎంపీలకు సీఎం దిశానిర్దేశం

image

AP: కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై టీడీపీ ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అమరావతికి చట్టబద్ధత బిల్లు, పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన నిధులను సాధించడంపై సూచనలు చేశారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్, రాష్ట్ర మంత్రి లోకేశ్ కూడా పాల్గొన్నారు.

News January 25, 2026

APPLY NOW: టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు

image

<>కొచ్చిన్ <<>>యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 3 టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 3 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. MSc కెమిస్ట్రీ, కెమికల్ ల్యాబ్‌లో పని అనుభవం గలవారు ఫిబ్రవరి 13 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని ఫిబ్రవరి 20 వరకు పంపాలి. వయసు 18-36ఏళ్ల మధ్య ఉండాలి. నెలకు రూ.41,970 చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.900, SC,ST అభ్యర్థులకు రూ.185. వెబ్‌సైట్: https://recruit.cusat.ac.in

News January 25, 2026

తేజస్వీ యాదవ్‌కు ఆర్జేడీ పగ్గాలు

image

రాష్ట్రీయ జనతాదళ్‌(RJD) నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తేజస్వీ యాదవ్‌ నియమితులయ్యారు. పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత యువ నాయకత్వానికి బాధ్యతలు అప్పగించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మాజీ డిప్యూటీ సీఎంగా అనుభవం ఉన్న తేజస్వి ఇకపై పార్టీ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించనున్నారు.