News December 6, 2024
సిబిల్ స్కోర్ తగ్గిందా.. ఇలా పెంచుకోండి..!

చాలా మంది సిబిల్ స్కోర్ తగ్గిపోయి లోన్లు రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎలా పెంచుకోవాలో తెలియక అవస్థలు పడుతుంటారు. కానీ కొన్ని పద్ధతులు పాటించి క్రెడిట్ స్కోర్ పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. క్రెడిట్ కార్డును 30 శాతం కంటే తక్కువగా వినియోగించాలి. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలి. లోన్ కోసం వెంటవెంటనే అప్లై చేయకూడదు. మీ పేరుపై ఇతరులకు లోన్ తీసి ఇవ్వకూడదు.
Similar News
News December 10, 2025
బుమ్రా అరుదైన రికార్డు.. తొలి భారత బౌలర్గా

టీమ్ ఇండియా దిగ్గజ పేసర్ జస్ప్రిత్ బుమ్రా అరుదైన రికార్డు నమోదు చేశారు. SAతో జరిగిన తొలి టీ20లో బ్రెవిస్ని ఔట్ చేసి 100 వికెట్స్ క్లబ్లో చేరారు. భారత్ తరఫున అర్ష్దీప్ తర్వాత ఈ ఘనత సాధించింది బుమ్రానే కావడం విశేషం. అలాగే అన్ని ఫార్మాట్లలో వంద వికెట్లు తీసిన తొలి ఇండియన్ బౌలర్గా అరుదైన రికార్డు నెలకొల్పారు. బుమ్రా కంటే ముందు లసిత్ మలింగ, టిమ్ సౌథీ, షకీబ్ అల్ హసన్, షాహీన్ అఫ్రిది ఉన్నారు.
News December 10, 2025
న్యాయ వ్యవస్థను బెదిరిస్తారా: పవన్ కళ్యాణ్

DMK ఆధ్వర్యంలోని ఇండీ కూటమి MPలు మద్రాస్ హైకోర్టు జడ్జిపై అభిశంసన నోటీసు ఇవ్వడాన్ని AP Dy.CM పవన్ ఖండించారు. “ఇది న్యాయవ్యవస్థ మొత్తాన్ని భయపెట్టే యత్నం కాదా? ఇలాంటప్పుడు భక్తులు తమ ఆలయాలను, మత వ్యవహారాలను స్వతంత్రంగా నిర్వహించేందుకు, రాజకీయ ద్వేషంతో ప్రేరితమైన న్యాయ దుర్వినియోగాలకు గురవకుండా ఉండేందుకు ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ ఏర్పాటు దేశానికి అత్యవసరం” అని <
News December 9, 2025
OFFICIAL: ‘అఖండ-2’ రిలీజ్ డేట్ ఇదే

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ-2’ సినిమాను ఈ నెల 12న విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రకటించింది. 11న ప్రీమియర్లు ఉంటాయని, త్వరలో బుకింగ్స్ ఓపెన్ అవుతాయని తెలిపింది. ఈ నెల 5న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ ఫైనాన్షియల్ వివాదాల కారణంగా చివరి నిమిషంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా వివాదాలు <<18513521>>పరిష్కారమవడంతో<<>> మూవీ రిలీజ్కు అడ్డంకులన్నీ తొలగిపోయాయి.


