News March 15, 2025

నిద్రలేమితో అనారోగ్యమే!

image

మనిషికి నిద్ర చాలా ముఖ్యమైనది. తగినంత నిద్రలేకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గురక నిద్రలేమికి సంకేతమని చెబుతున్నారు. నిద్రలేమితో కుంగుబాటు, ఆందోళన వంటి సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. సరైన నిద్ర ఉంటే 30-60% రోగుల్లో ఆల్జీమర్స్, గుండె జబ్బులు తగ్గుతున్నాయని తెలిపారు. ఏకధాటిగా 6-8 గంటలు నిద్రపోవాలని సూచిస్తున్నారు.

Similar News

News November 8, 2025

ఏపీ న్యూస్ అప్డేట్స్

image

* సీఎం చంద్రబాబు అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తర్వాత జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ ఎంపికపై సీనియర్ నేతలతో చర్చించారు.
* అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో శ్రీభక్త కనకదాసు జయంతి ఉత్సవాల్లో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. తత్వవేత్తగా, స్వరకర్తగా సమాజ చైతన్యానికి ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆదరణ పథకం కింద పేదలకు పనిముట్లు అందిస్తామని చెప్పారు.

News November 8, 2025

బరువు తగ్గేందుకు విపరీతంగా మందులు వాడేస్తున్నారు.. జాగ్రత్త!

image

ఊబకాయాన్ని తగ్గించుకునేందుకు చాలామంది భారతీయులు ఓ డయాబెటిస్‌ ఔషధాన్ని వాడుతున్నట్లు తేలింది. దీంతో మన దేశంలో వీటి అమ్మకాలు గత నెలలో ₹100 కోట్ల వరకూ జరిగాయి. అయితే ఈ మందులు తాత్కాలిక పరిష్కారం మాత్రమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బరువు తగ్గడానికి జీవనశైలిలో సరైన మార్పులు (పోషకాహారం, వ్యాయామం, నిద్ర, ఒత్తిడి నిర్వహణ) ప్రధానమని సూచిస్తున్నారు. వైద్యుల సూచన మేరకు వాడాలంటున్నారు.

News November 8, 2025

పుజారా కెరీర్‌ను కాపాడిన షారుఖ్.. ఎలాగంటే?

image

హీరో షారుఖ్ ఖాన్‌పై IND మాజీ ప్లేయర్ పుజారా భార్య పూజ ప్రశంసలు కురిపించారు. ఆమె రాసిన పుస్తకంలో షారుఖ్ తమ కుటుంబానికి చేసిన సాయాన్ని వివరించారు. ‘2008లో పుజారా మోకాలికి గాయమైంది. అప్పుడు SAలో చికిత్స చేయించేందుకు KKR యాజమాన్యం ముందుకొచ్చింది. అతనికి సాయంగా వెళ్లేందుకు పుజారా తండ్రికి పాస్‌పోర్ట్, ప్రయాణానికి షారుఖ్ సాయం చేశారు. KKR తరఫున పుజారా ఆడకపోయినా సాయం చేయడం గొప్ప విషయం’ అని గుర్తు చేశారు.