News September 20, 2024
సిద్దరామయ్య X గవర్నర్: ముడా కేసులో మరో ట్విస్ట్

కర్ణాటక CM సిద్దరామయ్యపై అన్ని డాక్యుమెంట్లు సహా డీటెయిల్డ్ రిపోర్టు ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ షాలినీ రజనీశ్ను గవర్నర్ థావర్చంద్ గహ్లోత్ ఆదేశించారు. KUDA చట్టానికి విరుద్ధంగా తన నియోజకవర్గం వరుణ, శ్రీరంగపట్నలో రూ.387 కోట్ల పనులు చేపట్టాలని MUDAను మౌఖికంగా ఆదేశించారని సీఎంపై గవర్నర్ వద్ద మరో పిటిషన్ దాఖలైంది. అధికార దుర్వినియోగంపై CBIతో దర్యాప్తు చేయించాలని పిటిషనర్ కోరడంతో గవర్నర్ స్పందించారు.
Similar News
News November 24, 2025
AP TET.. ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే?

AP: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) దరఖాస్తుల గడువు నిన్నటితో ముగిసింది. మొత్తం 2.59 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇన్ సర్వీస్ టీచర్లు 32,000 మంది దరఖాస్తు చేశారు. డిసెంబర్ 3 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. డిసెంబర్ 10 నుంచి ఆన్లైన్లో రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి.
News November 24, 2025
తిరుమల కొండపై ‘బంగారు బావి’ వైభవం

శ్రీవారి దర్శనం తర్వాత కనిపించేదే ‘బంగారు బావి’. దీనికి బంగారు రేకుల తాపడం ఉంటుంది. అందుకే ఈ పేరొచ్చింది. ఇందులో నుంచి వచ్చే జలాన్ని స్వామి కైంకర్యాలకు ఉపయోగిస్తారు. ఈ బావి అడుగున వైకుంఠంలో ప్రవహించే విరజానది ప్రవహిస్తుందని నమ్ముతారు. పూర్వజన్మలో తొండమాన్ చక్రవర్తిగా ఉన్న రంగదాసు ఈ పవిత్ర బావిని నిర్మించినట్లు స్థల పురాణం చెబుతోంది. అందుకే ఈ జలం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 24, 2025
అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలు తెలుసుకోండిలా

బ్యాంకు ఖాతాల్లోని అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలను RBI ఉద్గం <


