News March 19, 2025

సిద్దరామయ్య ఫ్లైట్ జర్నీకి రూ.31 కోట్లు.. తీవ్ర విమర్శలు

image

రెండేళ్లలో కర్ణాటక CM సిద్దరామయ్య విమాన ప్రయాణానికి రూ.31 కోట్లు ఖర్చు చేశారు. దీనిపై ప్రతిపక్షం తీవ్ర విమర్శలు చేస్తోంది. ఢిల్లీకి రానుపోనూ విమాన ఛార్జీ రూ.70 వేలకు మించదని, అలాంటిది ఛార్టర్ ఫ్లైట్‌లో వెళ్తూ ఒక ట్రిప్‌కే రూ.44.40 లక్షలు వృథా చేస్తున్నారని మండిపడుతోంది. రూ.10.85 లక్షలు ఖర్చు చేసి బెంగళూరు నుంచి మైసూరుకు కూడా హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్నారని విమర్శిస్తోంది.

Similar News

News October 22, 2025

మీ విషెస్‌కు థాంక్స్ ట్రంప్‌: మోదీ

image

దీపావళి సందర్భంగా విష్ చేసిన US అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ‘మీ ఫోన్ కాల్‌కు థాంక్స్. ఈ పండుగ నాడు మన రెండు ప్రజాస్వామ్య దేశాలు ప్రపంచాన్ని ప్రకాశింపజేయడాన్ని కొనసాగించాలి. టెర్రరిజానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడాలి’ అని పేర్కొన్నారు. కాగా 2 దేశాల మధ్య వాణిజ్యం గురించి <<18068579>>మోదీతో మాట్లాడినట్లు<<>> ట్రంప్ తెలిపారు. వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.

News October 22, 2025

విష్ణు వామనావతారం ఎందుకు ఎత్తాడు?

image

దానశీలి బలి చక్రవర్తి అపారమైన యాగబలంతో ఇంద్ర పదవిని ఆక్రమించి 3 లోకాలపై ఆధిపత్యాన్ని సాధించాడు. ఇది లోకాల సమతుల్యతను దెబ్బతీయడంతో పాటు దేవతల్లో ఆందోళన పెంచింది. ​అందుకే విష్ణువు, బలి దానగుణాన్ని గౌరవిస్తూనే, అతని అహంకారాన్ని అణచడానికి, లోకాలను రక్షించడానికి వామనుడి రూపంలో వచ్చాడు. కేవలం మూడడుగుల నేల అడిగి, బలిని పాతాళానికి పంపాడు. సద్గుణాలకు మెచ్చి ఆ లోకానికి రాజుగా చేసి, ధర్మాన్ని నిలబెట్టాడు.

News October 22, 2025

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

image

AP: తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా భక్తులు పోటెత్తుతున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. 26 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 76,343 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 18,768 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ కానుకల ద్వారా రూ.4.34 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ వెల్లడించింది.