News April 3, 2024

రాజకీయ భవితవ్యంపై సిద్దారామయ్య కీలక ప్రకటన

image

వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని కర్ణాటక CM సిద్దారామయ్య వెల్లడించారు. ప్రస్తుత సీఎం పదవీకాలం ముగిసిన తర్వాత రాజకీయాలకు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ‘ప్రజల కోరిక మేరకు గత ఎన్నికల్లో పోటీ చేశారు. వచ్చే నాలుగేళ్లలో నాకు 83 ఏళ్లు పూర్తవుతాయి. ఆ తర్వాత అంత నిబద్ధతతో పని చేయలేను. నా ఆరోగ్య పరిస్థితి గురించి నాకే తెలుసు. అందుకు రాజకీయాలు చాలని నిర్ణయించుకున్నా’ అని తెలిపారు.

Similar News

News November 19, 2025

వరంగల్ కలెక్టర్‌కు మంత్రి పొంగులేటి అభినందనలు

image

జల సంరక్షణ కేటగిరీ-2లో వరంగల్ జిల్లా అవార్డు సాధించి, ఢిల్లీలో అవార్డు స్వీకరించిన నేపథ్యంలో, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి ఐఏఎస్‌ను ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. అనంతరం జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై కలెక్టర్ మంత్రితో కాసేపు చర్చించారు.

News November 19, 2025

ఈవీల విక్రయాల్లో MG విండ్సర్ రికార్డ్

image

ఈవీ కార్ల అమ్మకాల్లో MG విండ్సర్ రికార్డులు బద్దలు కొడుతోంది. భారత్‌లో 400 రోజుల్లోనే 50వేల యూనిట్లు విక్రయించినట్లు సంస్థ తాజాగా ప్రకటించింది. నెలకు 3,800పైగా కార్ల చొప్పున విక్రయాలు జరిగినట్లు పేర్కొంది. భారతీయ మార్కెట్లో అత్యంత వేగంగా 50వేల మార్కును అందుకున్న ఫోర్ వీలర్ ఈవీగా నిలిచినట్లు వెల్లడించింది. బ్రిటన్‌కు చెందిన MG.. ఇండియాలో JSWతో జతకట్టి తమ కార్ల విక్రయాలు ప్రారంభించింది.

News November 19, 2025

సూసైడ్ బాంబర్ వీడియోలు తొలగించిన META

image

ఢిల్లీ ఎర్రకోట వద్ద ఆత్మాహుతికి పాల్పడిన సూసైడ్ బాంబర్ ఉమర్ సెల్ఫీ వీడియో SMలో వైరలైన విషయం తెలిసిందే. వాటిని META సంస్థ తమ ప్లాట్ ఫామ్స్ నుంచి తొలగించింది. తమ యూజర్ గైడ్ లైన్స్‌కు విరుద్ధంగా ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ‘నాది ఆత్మహత్య కాదు.. <<18318092>>బలిదానం<<>>’ అని ఉమర్ ఆ వీడియోలో సమర్థించుకున్నాడు. అయితే ఈ వీడియో ట్విటర్‌లో అందుబాటులోనే ఉండటం గమనార్హం.