News March 28, 2024

హీరోయిన్‌తో పెళ్లిపై స్పందించిన సిద్ధార్థ్

image

హీరోయిన్ అదితీ రావు హైదరీతో పెళ్లి ప్రచారంపై హీరో సిద్ధార్థ్ స్పందించారు. ‘She Said YES! E. N. G. A. G. E. D’ అని ఆయన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. అదితి కూడా ‘He Said YES! E. N. G. A. G. E. D’ అని పోస్టు చేశారు. రింగ్స్ మార్చుకున్న ఫొటో షేర్ చేశారు. వీరిద్దరూ గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారు. కాగా.. వనపర్తిలోని శ్రీరంగపురం ఆలయంలో వీరి పెళ్లి జరిగినట్లు వార్తలు వచ్చాయి.

Similar News

News September 18, 2025

27 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి

image

ఐఐటీ ఢిల్లీలో 4 ప్రాజెక్ట్ సైంటిస్టు పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఈ నెల 30 ఆఖరు తేదీ. ఐఐటీ హైదరాబాద్‌లో 4 రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు ఈనెల 26 వరకు, మునిషన్స్ ఇండియా లిమిటెడ్‌లో 14 ఇంజినీర్ పోస్టులకు ఈ నెల 28వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్‌లో 5 ఉద్యోగాలకు అక్టోబర్ 3 వరకు అవకాశం ఉంది.

News September 18, 2025

3 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్

image

AP: ఈ నెల 26 నుంచి 28 వరకు 3 రోజుల పాటు బాపట్ల జిల్లాలోని సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్ జరగనుంది. ఇందులో భాగంగా సాహస క్రీడలు, ఎగ్జిబిషన్, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ నెల 27న సీఎం చంద్రబాబు బీచ్‌ను సందర్శించి, రూ.97 కోట్ల అభివృద్ధి పనులుకు శంకుస్థాపన చేస్తారని ప్రభుత్వం తెలిపింది. బాపట్ల పట్టణం నుంచి సూర్యలంక బీచ్ 9 కి.మీ దూరం ఉంటుంది.

News September 18, 2025

శ్రీవారి దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం శిలా తోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న స్వామివారిని 68,213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,410 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.86 కోట్ల ఆదాయం వచ్చినట్లు TTD వెల్లడించింది.