News March 17, 2024

సిద్దిపేట: ప్రజావాణి కార్యక్రమం రద్దు

image

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లోకి వచ్చిన సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరగదన్నారు. జిల్లా ప్రజలు గమనించగలరని ఆయన సూచించారు. సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలోనూ రేపు ప్రజావాణి నిర్వహించారు.
SHARE IT

Similar News

News October 31, 2024

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

image

తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. మనిషి తనలోని మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞాన దీపాలను వెలిగించుకోవాలనే తాత్వికతను దీపావళి పండుగ మనకు అందిస్తుందని కేసీఆర్ తెలిపారు. దీపావళి పర్వదినానికి హిందూ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉన్నదన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని దీపావళి సందర్భంగా కేసీఆర్ ప్రార్థించారు.

News October 30, 2024

సంగారెడ్డి: టెన్త్ ప్రత్యేక తరగతుల సమయంలో మార్పులు

image

పదో తరగతి ప్రత్యేక తరగతుల సమయంలో మార్పులు చేస్తూ సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ.. సాయంత్రం 4.15 నుంచి 5.15 గంటల వరకు అన్ని ప్రభుత్వ, కేజీబీవీ పాఠశాలలు పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు.

News October 30, 2024

మెదక్: మోత మోగుతున్న ‘టపాసుల’ ధరలు !

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో టపాసుల ధరలు మోత మోగుతున్నాయి. షాపుల అనుమతి, ఇతరత్రాకు సంబంధించి మామూళ్లు చెల్లించిన వ్యాపారులు ఆ భారమంతా వినియోగదారులపై మోపుతున్నారు. భారీగా పెరిగిన టపాసుల ధరలతో ఈ ఏడాది సాధారణ, మధ్యతరగతి వారు టపాసులు కొనాలంటేనే జంకుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కాకర పుల్ల నుంచి 1000 వాలా వరకు టపాసుల ధరలు 30% పెరిగాయి. వ్యాపారులు వారి నోటికి ఎంత వస్తే అంతే చెప్పి ధరలు పిండుకుంటున్నారు.