News October 14, 2024
హిట్ లిస్ట్లో సిద్దిఖీ కుమారుడు కూడా!

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్ట్లో హత్యకు గురైన మాజీ మంత్రి బాబా సిద్దిఖీ సహా ఆయన కుమారుడు, MLA జీషన్ సిద్దిఖీ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇద్దర్నీ చంపడానికి నిందితులు ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. హత్యకు ప్లాన్ చేసిన స్పాట్లో సిద్దిఖీతోపాటు జీషన్ కూడా ఉంటారని నిందితులకు సమాచారం ఉందని, ఎవరు కనిపిస్తే వారిని హత్య చేసేందుకు ప్లాన్ చేశారని పోలీసు వర్గాలు తెలిపాయి.
Similar News
News December 5, 2025
OU: ఈ నెల 22 నుంచి స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వాయిదాపడ్డ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (SET) పరీక్షలను ఈ నెల 22 నుంచి నిర్వహించనున్నట్లు సెట్ మెంబర్ సెక్రటరీ బి.శ్రీనివాస్ తెలిపారు. 3 రోజుల పాటు ఈ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు ఈ విషయం గమనించాలని శ్రీనివాస్ కోరారు. అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలకు అర్హత పొందేందుకు ఈ సెట్ నిర్వహిస్తారు.
News December 5, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఇస్రో-<
News December 5, 2025
ఇలాంటి మొక్కజొన్న గింజలకు మంచి ధర

మొక్కజొన్నను నూర్పిడి చేసిన తర్వాత మార్కెట్లో మంచి ధర రావాలంటే తప్పనిసరిగా కొన్ని నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. నూర్పిడి చేసిన గింజల్లో దుమ్ము, చెత్త, రాళ్లు, మట్టి పెళ్లలు 1 శాతం మించరాదు. గింజల్లో తేమ 14 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. విరిగిన విత్తనాలు 2 శాతానికి మించరాదు. పాడైపోయిన విత్తనాలు 6 శాతం లోపు ఉండాలి. ఇతర రంగు మొక్కజొన్న గింజలు 6 శాతం మించకుండా ఉండాలి.


