News March 22, 2024

ఈనెల 26న మోదీ ఇంటి ముట్టడి: ఆప్

image

ఆమ్ ఆద్మీ పార్టీ కీలక ప్రకటన చేసింది. తమ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఈనెల 26న ప్రధాని మోదీ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చింది. అలాగే ఈ ఏడాది పార్టీ శ్రేణులెవరూ హోలీ జరుపుకోవద్దని నిర్ణయించింది. రేపు ఢిల్లీలోని షాహిదీ పార్కులో దేశాన్ని కాపాడతామంటూ ప్రతిజ్ఞ నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

Similar News

News November 28, 2025

పీసీఓఎస్ ఉందా? ఇలా చేయండి

image

పీసీఓఎస్ ఉన్నవారిలో ప్రధాన సమస్య బరువు. ఎంత కడుపు మాడ్చుకున్నా, వ్యాయామాలు చేసినా బరువు తగ్గడం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటివారు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు. పులియబెట్టిన ఆహారాలు, ఫైబర్, ప్రొటీన్ ఫుడ్స్ డైట్‌లో చేర్చుకోవాలి. అవకాడో, ఆలివ్‌ నూనె, కొబ్బరి నూనె, నట్స్‌.. వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి. వీటితో పాటు వ్యాయామాలు, తగినంత నిద్ర ఉండాలి.

News November 28, 2025

2,757 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) 2,757 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఏ, బీకామ్, బీఎస్సీ, డిప్లొమా, టెన్త్, ఐటీఐ, ఇంటర్ అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి డిసెంబర్ 18 వరకు NAPS/NATS పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iocl.com

News November 28, 2025

వరల్డ్‌లోనే ఎత్తైన శ్రీరాముడి విగ్రహం.. నేడు ప్రారంభించనున్న మోదీ

image

ద.గోవాలోని శ్రీసంస్థాన్ గోకర్ణ పార్తగాలి జీవోత్తమ మఠంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 77అడుగుల శ్రీరాముడి కంచు విగ్రహాన్ని PM మోదీ నేడు సాయంత్రం ఆవిష్కరించనున్నారు. ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ రూపకర్త రామ్ సుతార్‌ తల్పోణ నదీ తీరంలో దీన్ని రూపొందించారు. మఠం స్థాపించి 550ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గోవా గవర్నర్ అశోక్ గాజపతిరాజు, CM ప్రమోద్ సావంత్ విగ్రహ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.