News March 13, 2025

‘సిల్లీ ఓల్డ్ ప్రోగ్రామ్స్‌‌’ను AIగా ప్రచారం చేస్తున్నారు: నారాయణ మూర్తి

image

దేశంలో కొన్ని కంపెనీలు ‘సిల్లీ ఓల్డ్ ప్రోగ్రామ్స్‌’ను AIగా ప్రచారం చేస్తున్నాయని ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అన్నారు. ప్రతి దానికీ AIతో ముడిపెడుతూ మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయిందన్నారు. ‘AIలో 2 ప్రాథమిక సూత్రాలుంటాయి. ఒకటి మెషీన్ లెర్నింగ్. ఇది ప్రిడిక్ట్ చేయడానికి లార్జ్ డేటా కావాలి. రెండోది డీప్ లెర్నింగ్. మెదడు పనితీరును అనుకరిస్తుంది. పర్యవేక్షణ లేని ఆల్గారిథమ్స్‌ను పరిష్కరిస్తుంది’అని వివరించారు.

Similar News

News March 13, 2025

ఇలా చదివితే ఈజీగా గుర్తుంటాయ్!

image

ఇది పరీక్షల సమయం. సిస్టమేటిక్‌గా చదువుకుంటే ఈజీగా పరీక్షలు రాయొచ్చు. దీనికి పోమోడోర్ టెక్నిక్‌ (టైమ్ మేనేజ్‌మెంట్) ఎంతో యూజ్‌ఫుల్ అని నిపుణులు చెబుతున్నారు. ‘చదవాల్సిన విషయాన్ని ఎంచుకోండి. దీనికోసం టైమర్‌ని 25 ని.లకు సెట్ చేసుకోండి. టైమర్ పూర్తవగానే ఓ 10 ని.లు బ్రేక్ ఇవ్వండి. నాలుగు సార్లు ఇలా చేశాక 30 ని.లు బ్రేక్ తీసుకోండి. ఇలా చేస్తే దృష్టి మెరుగై పరధ్యానం తగ్గుతుంది’ అని తెలిపారు. SHARE IT

News March 13, 2025

ఒంటిపూట బడులు.. ఉత్తర్వులు జారీ

image

తెలంగాణలో ఈనెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉ.8 నుంచి మ.12.30 గంటల వరకు స్కూళ్లు నడవనున్నాయి. పదో తరగతి పరీక్ష కేంద్రాలున్న స్కూళ్లలో ఒంటి గంట నుంచి సా.5 వరకు తరగతులు నిర్వహిస్తారు. అటు ఏపీలోనూ ఎల్లుండి నుంచి ఒంటిపూట స్కూళ్లు ప్రారంభం కానున్నాయి.

News March 13, 2025

మహిళలతో తప్పుడు ప్రవర్తన.. చెంప చెళ్లుమనిపించా: హీరో

image

మహిళలతో తప్పుగా ప్రవర్తించిన ఓ అభిమాని చెంప చెళ్లుమనిపించానని హిందీ నటుడు గోవిందా ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ‘2008లో సంతోష్ అనే అభిమాని నా కోసం సెట్స్‌కు వచ్చాడు. అతడు మహిళలతో తప్పుగా ప్రవర్తించడం చూసి చెంప మీద కొట్టాను. దీంతో అతడు నాపై కేసు పెట్టాడు. 9ఏళ్లపాటు ఆ కేసు సాగింది. ఎట్టకేలకు అతడిపై స్టింగ్ ఆపరేషన్ చేసి ఆధారాలు సంపాదించి కేసు గెలిచాను’ అని తెలిపారు.

error: Content is protected !!