News September 26, 2025
ఆల్ టైమ్ రికార్డుకు చేరిన వెండి ధరలు

వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ KG వెండిపై రూ.3000 పెరిగి రూ.1,53,000తో ఆల్ టైమ్ రికార్డుకు చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 పెరిగి రూ.1,14,880కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10g గోల్డ్ రూ.400 ఎగబాకి రూ.1,05,300 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
Similar News
News February 17, 2026
KCR బర్త్‌డే.. సాదాసీదాగా కవిత విషెస్

TG: మాజీ సీఎం, తన తండ్రి KCR పుట్టినరోజు సందర్భంగా కవిత ట్విటర్ వేదికగా విషెస్ తెలిపారు. ‘ఉద్యమ నాయకులు, గౌరవ పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ ఆమె సాదాసీదాగా ట్వీట్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇటీవల బీఆర్ఎస్‌తో పాటు కేసీఆర్‌పైనా ఆమె విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇక చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ కూడా KCRకు విషెస్ తెలిపారు.
News February 17, 2026
నా కూతురిని రేప్ చేసి చంపేశారు: ప్రత్యూష తల్లి

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు <<19164468>>తీర్పును<<>> గౌరవిస్తున్నానని ఆమె తల్లి సరోజిని పేర్కొన్నారు. కానీ తనకు న్యాయం జరగలేదన్నారు. ‘నా కూతుర్ని అత్యాచారం చేసి చంపేశారు. నిందితుడికి జీవిత ఖైదు వేయాలని పోరాటం చేశా. కేసు మొదట్లోనే సాక్ష్యాలను తారుమారు చేశారు. ప్రత్యూష శరీరంపై గాట్లు ఉన్నాయి. ఆమెపై అత్యాచారం, హత్య జరిగిందని మునుస్వామి ఇచ్చిన రిపోర్టును ఎందుకు పక్కన పెట్టారు?’ అని ప్రశ్నించారు.
News February 17, 2026
రఫేల్‌వైపే భారత్ ఆసక్తి ఎందుకు?

IAFను పటిష్ఠం చేసుకునేందుకు భారత్ 114 రఫేల్ విమానాల కొనుగోలు, లోకల్‌గా తయారీపై ఫోకస్ పెట్టింది. రష్యాకు చెందిన SU-57, USకు చెందిన F-35ను పక్కనపెట్టి రఫేల్‌కు ప్రాధాన్యం ఇవ్వడం చర్చనీయాంశమైంది. రఫేల్‌లో థర్ట్‌పార్టీ అవసరం లేకుండా డైరెక్ట్ డేటా ఎక్స్‌ఛేంజ్‌కు అవకాశం ఉండటం, మెయింటైన్ సులభంగా ఉండటం, వీటి కొనుగోలుతో ఎలాంటి రాజకీయ సవాళ్లు రాకపోవడం వల్ల భారత్ దీనికి ప్రాధాన్యం ఇస్తోంది.


