News August 25, 2025
ALL TIME RECORDకి చేరిన వెండి ధరలు

వెండి ధరలు క్రమంగా పెరుగుతూ ఆల్ టైమ్ రికార్డుకు చేరుకున్నాయి. ఇవాళ కిలో వెండిపై రూ.1,000 పెరిగి తొలిసారి రూ.1,31,000ను తాకింది. గత 5 రోజుల్లో రూ.6,000 పెరగడం గమనార్హం. అటు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.110 తగ్గి రూ.1,01,510కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.100 పతనమై రూ.93,050 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
Similar News
News August 25, 2025
డిప్యూటీ స్పీకర్ RRRకు ఊరట

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. HYD గచ్చిబౌలి PSలో ఆయనపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టేసింది. MPగా ఉన్న సమయంలో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ బాషాపై దాడి చేశారని RRRతో పాటు ఆయన కుమారుడు భరత్, కార్యాలయ సిబ్బందిపై FIR నమోదైంది. ఈ కేసును కొనసాగించలేనని కానిస్టేబుల్ బాషా వేసిన అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం FIRను కొట్టేస్తూ తీర్పిచ్చింది.
News August 25, 2025
BSFలో 1,121 ఉద్యోగాలు.. వివరాలివే

BSF 1,121 హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్, రేడియో మెకానిక్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది. టెన్త్+రెండేళ్ల ITI లేదా ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌లో 60% మార్కులున్న వారు అర్హులు. వయసు జనరల్ అభ్యర్థులకు 18-25, OBC 18-28, SC, STలకు 18-30 ఏళ్లు ఉండాలి. ఫిజికల్, CBT టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం: ₹25,500-81,100, <
News August 25, 2025
జగన్‌పై విష ప్రచారం చేస్తున్నారు: భూమన

AP: YCP అధినేత జగన్‌పై TTD ఛైర్మన్ BR నాయుడు ఛానల్ విష ప్రచారం చేస్తోందని YCP నేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఈనెల 27న జగన్ తిరుమల పర్యటన అంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారన్నారు. ‘చంద్రబాబు పాలనలో కంటే YCP హయాంలోనే కొన్ని వేల రెట్లు హిందూ ధర్మ పరిరక్షణ జరిగింది. CMగా జగన్ ఐదేళ్లు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీనివాస దివ్య హోమం ఆయన పాలనలోనే ప్రారంభమైంది’ అని వివరించారు.