News April 7, 2025

రేపు సింహాద్రి అప్పన్న కళ్యాణం

image

AP: ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం రేపు అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రతి ఏటా చైత్ర శుద్ధ ఏకాదశి పర్వదినాన స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈరోజు రాత్రి అంకురార్పణతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. రేపు మధ్యాహ్నం కొట్నాల ఉత్సవం, ఎదురు సన్నాహం పూర్తవుతాయి. రాత్రి 8గంటలకు రథోత్సవం, 9.30గంటలకు స్వామి కళ్యాణ మహాత్సవం జరుగుతాయి.

Similar News

News April 9, 2025

భారత్‌కు మరో 26 రఫేల్ యుద్ధ విమానాలు!

image

26 రఫేల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌తో భారత్ ఒప్పందం తుది దశకు వచ్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రూ.63 వేల కోట్ల అగ్రిమెంట్‌పై త్వరలో ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేయనున్నారని వెల్లడించాయి. ఈ ఒప్పందంలో భాగంగా ఇండియన్ నేవీకి 22 సింగిల్ సీటర్, 4 ఫోర్ సీటర్ విమానాలు సమకూరుతాయని పేర్కొన్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

News April 9, 2025

వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు

image

AP: వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఈ నెల 23 వరకు రిమాండ్ పొడిగిస్తూ సీఐడీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో జైలులో ఉన్న ఆయనతో పాటు మరో 9 మంది రిమాండ్ గడువు ఇవాళ్టితో ముగియడంతో అధికారులు కోర్టులో హాజరుపరిచారు. వారి జ్యుడీషియల్ కస్టడీ పొడిగించాలన్న పోలీసుల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఆమేరకు ఆదేశాలిచ్చింది.

News April 9, 2025

త్వరలో ఫార్మా రంగంపై ట్రంప్ టారిఫ్స్ మోత

image

ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫార్మా ఉత్పత్తులపైనా త్వరలోనే టారిఫ్‌లు విధించనున్నట్లు ప్రకటించారు. USకు దిగుమతయ్యే ఔషధ ఉత్పత్తులపై భారీ స్థాయిలో సుంకాలు తప్పక ఉంటాయన్నారు. USలో ఫార్మా ఉత్పత్తులు తయారు కావట్లేదని, అందుకే ఇతర దేశాల నుంచి వచ్చే ఔషధాలపై సుంకాలు విధించనున్నట్లు తెలిపారు. IND సహా పలు దేశాలపై US ఇప్పటికే టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే.

error: Content is protected !!