News November 22, 2024

సింపుల్‌గానే చై-శోభిత పెళ్లి: నాగార్జున

image

అక్కినేని నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ల వివాహం సింపుల్‌గా జరుగుతుందని నాగార్జున తెలిపారు. వీరి వివాహం డిసెంబర్ 4న HYDలోని అన్నపూర్ణస్టూడియోస్‌లో జరగనుంది. అయితే ఇందుకు 300-400 మంది కుటుంబ సభ్యులు, బంధువులు, ఇండస్ట్రీలోని సన్నిహితులను మాత్రమే ఆహ్వానించామన్నారు. వారిద్దరూ సింపుల్‌ వెడ్డింగ్‌ కోరుకోవడంతో ఏర్పాట్లను కూడా వాళ్లకే వదిలేశానన్నారు.

Similar News

News December 3, 2025

వదల ‘బొమ్మా’ళి.. మళ్లీ కస్టడీ పిటిషన్

image

TG: ఐబొమ్మ రవి కేసులో మరో 4 కేసుల్లో కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. ఒక్కో కేసులో 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు. దీనికి కౌంటర్ దాఖలు చేయాలని రవి న్యాయవాదిని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఇప్పటివరకు ఒకే కేసులో రవిని పోలీసులు రెండుసార్లు కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. అటు కస్టడీ పూర్తి కావడంతో రవి బెయిల్ పిటిషన్‌పై న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

News December 3, 2025

‘కాటన్ ష్రెడర్’తో పత్తి వ్యర్థాల సద్వినియోగం

image

పత్తి పంటలో వ్యర్థాల తొలగింపునకు కూలీల కొరత ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ‘కాటన్ ష్రెడర్’ యంత్రం అందుబాటులో ఉంది. ఇది పత్తి మొక్క కాండాన్ని కత్తిరించి చిన్న ముక్కలుగా చేస్తుంది. ఈ ష్రెడర్ సాయంతో 3 గంటల్లో 1 హెక్టార్ భూమిలో పత్తి పంట వ్యర్థాలను తొలగించి ముక్కలుగా చేసి భూమిలో కలిపివేయవచ్చు లేదా పారిశ్రామిక అవసరాలకు వాడవచ్చు. పత్తి మొక్క కాండాలను భూమిలో కలపడం వల్ల భూసారం పెరుగుతుంది.

News December 3, 2025

‘కాటన్ ష్రెడర్‌’తో మరిన్ని ప్రయోజనాలు

image

కాటన్ ష్రెడర్‌తో తక్కువ ఇంధనంతోనే మొక్క కాండాలను చిన్న ముక్కలుగా చేయవచ్చు. పత్తి వ్యర్థాలను భూమిలో కలియదున్నడం వల్ల నేలసారం పెరగడంతో పాటు నీటిని నిల్వచేసుకునే సామర్థ్యం భూమికి పెరుగుతుంది. మట్టి సేద్యానికి అనువుగా, వదులుగా మారుతుంది. నేల కోతను తగ్గించవచ్చు. పత్తి వ్యర్థాలను భూమిలో కలియదున్నడం వల్ల గులాబీ పురుగు ఉద్ధృతిని చాలా వరకు తగ్గుతుంది. పంటకు మేలుచేసే సూక్ష్మజీవుల సంఖ్య వృద్ధి చెందుతుంది.