News July 28, 2024

36 ఏళ్ల నుంచి గురి తప్పట్లేదుగా!

image

ఒలింపిక్స్‌ ఆర్చరీ విభాగంలో సౌత్ కొరియా రారాజుగా వెలుగొందుతోంది. 1988లో విశ్వ క్రీడల్లో ఆర్చరీ టీమ్ ఈవెంట్‌ను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి సౌత్ కొరియా ఉమెన్స్ టీమ్ పట్టు వదలడం లేదు. గోల్డ్ మెడల్‌ను వేరే దేశానికే వెళ్లనీయలేదు. 1988, 1992, 96, 2000, 2004, 2008,2012, 2016, 2020, 2024 ఒలింపిక్స్‌లో అజేయంగా నిలిచింది. ఈ 36 ఏళ్లలో భారత్‌కు ఆర్చరీలో ఒక్క పతకం రాలేదు. ఇవాళ జరిగిన పోటీలోనూ భారత్ ఓడింది.

Similar News

News December 30, 2024

ఆతిశీని కేజ్రీవాల్ టెంపరరీ సీఎం అనడం అవమానకరం: ఢిల్లీ LG

image

ఢిల్లీ CM ఆతిశీ మార్లేనాను అరవింద్ కేజ్రీవాల్ టెంపరరీ CM అనడం బాధించిందని లెఫ్టినెంట్ గవర్నర్ VK సక్సేనా బాంబుపేల్చారు. ఇది ఒక రకంగా తనకూ అవమానమేనని పేర్కొన్నారు. న్యూఇయర్ విషెస్ చెబుతూ ఆమెకు లేఖ రాశారు. ‘మీరు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నేను మనస్ఫూర్తిగా అభినందించాను. మీరు CM అవ్వడం నాకూ సంతోషమే. మీ పూర్వ CM చేయలేని పనులనూ మీరు చక్కబెడుతున్నారు. మంత్రిగానూ నిబద్ధతతో పనిచేశారు’ అని పేర్కొన్నారు.

News December 30, 2024

Good News: ఎయిడ్స్ టీకాకు USFDA ఆమోదం

image

ఎప్పుడెప్పుడా అని ప్రపంచమంతా ఎదురుచూస్తున్న HIV/AIDS వ్యాక్సిన్ వచ్చేసింది. గిలీడ్ సైన్సెస్ రూపొందించిన Lenacapavirకు USFDA అనుమతి ఇచ్చింది. మూడేళ్లలోనే ఈ టీకా 20 లక్షల మందికి చేరనుంది. ఎయిడ్స్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న దక్షిణాఫ్రికా, టాంజానియాలో నిర్వహించిన ట్రయల్స్‌లో మంచి ఫలితాలు వచ్చాయని తెలిసింది. ఏడాదికి 2సార్లు తీసుకోవాల్సిన ఈ టీకా ఖరీదు సామాన్యులకు అందుబాటులో ఉండదన్న ఆందోళన నెలకొంది.

News December 30, 2024

ఎయిడ్స్‌తో ఇప్పుడు ఎందరు బతుకుతున్నారంటే..

image

HIV/AIDSను 1983లో మొదటిసారి అమెరికాలో గుర్తించారు. అక్కడి నుంచి అన్ని దేశాలకు పాకేసింది. ప్రపంచానికి ఇదో పెనుముప్పుగా మారడంతో ‘ఎయిడ్స్‌కు మందు లేదు. నివారణే మార్గం’ అన్న నినాదం పుట్టుకొచ్చింది. HIV సోకి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4.2 కోట్ల మంది చనిపోయారని అంచనా. మొత్తంగా 8.8 కోట్ల మందికి సోకింది. 2023 చివరి నాటికి 4 కోట్ల మంది ఎయిడ్స్‌తోనే బతుకుతున్నారు. ఎట్టకేలకు వ్యాక్సిన్ రావడం భారీ ఊరట.