News October 18, 2024

డెన్మార్క్ ఓపెన్‌లో సింధు ఓటమి

image

డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు ప్రస్థానం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. ఇండోనేషియా ప్లేయర్ గ్రెగోరియా టుంజుంగ్ చేతిలో 13-21, 21-16, 9-21 తేడాతో ఆమె పరాజయంపాలయ్యారు. ఆమె ఓటమితో ఈ టోర్నీ నుంచి భారత్ రిక్త హస్తాలతో వెనుదిరిగింది. మిగిలిన అన్ని విభాగాల్లోనూ భారత ప్లేయర్లు ముందే ఇంటిబాట పట్టిన సంగతి తెలిసిందే.

Similar News

News October 19, 2024

అల్పపీడనం.. 24న వాయుగుండంగా మారే ఛాన్స్

image

AP: ఈనెల 22న మధ్య బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనంపై రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అప్‌డేట్ ఇచ్చింది. అల్పపీడనం వాయవ్య దిశగా కదిలి 24న వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత అది ఎటు పయనిస్తుందనే విషయంపై మరింత స్పష్టత రావాల్సి ఉందని వెల్లడించింది. దీనిపై ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది.

News October 19, 2024

ఫైనల్‌కు దూసుకెళ్లిన న్యూజిలాండ్

image

టీ20 మహిళల వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. వెస్టిండీస్‌తో జరిగిన రెండో సెమీ ఫైనల్లో ఆ జట్టు 8 పరుగుల తేడాతో గెలిచింది. 129 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన విండీస్‌ 120/8కే పరిమితమైంది. ఆ జట్టులో డాటిన్ (33) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. కివీస్ బౌలర్లలో కార్సన్ 3, కెర్ 2 వికెట్లు తీశారు. ఎల్లుండి దుబాయ్‌లో జరిగే ఫైనల్లో సౌతాఫ్రికాతో న్యూజిలాండ్ తలపడనుంది.

News October 19, 2024

అక్టోబర్ 22 నుంచి ఆధార్ క్యాంపులు

image

AP: అక్టోబర్ 22 నుంచి ఆధార్ ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. గ్రామ, వార్డు సచివాలయాలు, కాలేజీలు, స్కూళ్లు, అంగన్‌వాడీ సెంటర్లలో 4 రోజుల పాటు ఈ క్యాంపులు నిర్వహించనుంది. ఇందుకోసం ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు తగిన చర్యలు తీసుకోవాలంది. ఈ క్యాంపుల్లో కొత్త ఆధార్ నమోదు, బయోమెట్రిక్ అప్‌డేట్, డెమోగ్రాఫిక్ అప్‌డేట్, ఈ-ఆధార్ వంటి సేవలు అందించనున్నారు.