News October 23, 2024

Singam Again: షూట్‌లో చుల్‌బుల్ పాండే!

image

సింగం ఫ్రాంచైజీలో వ‌స్తున్న సింగం అగైన్‌లో స‌ల్మాన్ స్పెష‌ల్ క్యామియో క‌న్ఫార్మ్ అయ్యింది. సూప‌ర్ కాప్ నేప‌థ్యమున్న ఈ చిత్రంలో ద‌బాంగ్‌లో స‌ల్మాన్ న‌టించిన చుల్‌బుల్ పాండే పాత్ర‌నే ఈ సినిమాలోనూ చేసిన‌ట్టు సమాచారం. గ్యాంగ్‌స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హెచ్చ‌రిక‌లు వ‌స్తున్నా అజ‌య్ దేవ‌గ‌ణ్‌, రోహిత్ శెట్టిల‌కు ఇచ్చిన మాట ప్ర‌కారం స‌ల్మాన్ మంగ‌ళ‌వారం షూటింగ్‌లో పాల్గొన్న‌ట్టు తెలిసింది.

Similar News

News October 23, 2024

గంజాయి కాల్చేందుకు స్టేషన్‌కే వెళ్లారు!

image

వారందరూ మైనర్లు, విద్యార్థులు. కేరళలోని త్రిస్సూర్ నుంచి మున్నార్ వరకూ టూర్ వెళ్తున్నారు. దారిలో భోజనం కోసం బస్సు ఆగినప్పుడు ఇద్దరు కుర్రాళ్లు గంజాయి బీడీల్ని తాగాలనుకున్నారు. అగ్గిపెట్టె లేకపోవడంతో పక్కనే ఉన్న బిల్డింగ్‌లోకి వెళ్లి అడిగారు. తీరా చూస్తే అది ఎక్సైజ్ పోలీస్ స్టేషన్. పోలీసులు ఇద్దర్నీ అరెస్ట్ చేసి జువెనైల్ చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.

News October 23, 2024

చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై నేడు తీర్పు

image

TG: బీఆర్ఎస్ నేత, వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వంపై ఇవాళ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఆయనకు జర్మనీ పౌరసత్వం ఉన్నప్పటికీ తప్పుడు పత్రాలతో భారత పౌరసత్వం పొందారని అందిన ఫిర్యాదుపై కేంద్రం విచారించి 2017లో ఆయన భారత పౌరసత్వాన్ని రద్దు చేసింది. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించగా కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. సుదీర్ఘంగా వాదనలు విన్న ధర్మాసనం తీర్పును నేటికి వాయిదా వేసింది.

News October 23, 2024

ఇండియాలోనే అత్యంత నెమ్మదైన రైలు ఏదంటే..

image

హౌరా-అమృత్‌సర్ రైలుకు అత్యంత నెమ్మదిగా గమ్యం చేరే రైలుగా పేరుంది. 111 స్టేషన్లలో ఆగుతూ వెళ్లడం వల్ల ఆఖరి స్టేషన్‌కు చేరుకునేందుకు 37 గంటలు పడుతుంటుంది. బెంగాల్, బిహార్, యూపీ, హరియాణా, పంజాబ్ రాష్ట్రాల మీదుగా 1910 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఈరోజు రాత్రి 7.15 గంటలకు హౌరా స్టేషన్లో బయలుదేరితే ఎల్లుండి ఉదయం 8.40 గంటలకు అమృత్‌సర్ చేరుతుంది. టికెట్ ధర తక్కువే కావడంతో ఈ రైలుకు డిమాండ్ ఎక్కువే.