News April 8, 2025
సింగపూర్ అగ్నిప్రమాదం.. చిన్నారి మృతి

సింగపూర్‌లోని స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ చిన్నారి మరణించారు. ఇదే ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ చిన్న కొడుకు మార్క్ శంకర్‌కు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో 19 మంది గాయపడ్డారు. కాగా ఇవాళ సాయంత్రం పవన్ సింగపూర్ వెళ్లనున్నారు.
Similar News
News November 24, 2025
పీజీఆర్ఎస్ సద్వినియోగం చేస్కోండి: కలెక్టర్

Meekosam.ap.gov.inలో PGRS అర్జీలు సమర్పించవచ్చని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. నేరుగా పీజీఆర్ఎస్లో కూడా అందించవచ్చన్నారు. గుంటూరు కలెక్టరేట్లో సోమవారం పీజీఆర్ఎస్ జరుగుతుందని చెప్పారు. అర్జీ స్థితి గతులను 1100 టోల్ ఫ్రీకి ఫోన్ చేసి తెలుసుకోవచ్చని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.
News November 24, 2025
KU మహిళా ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థినుల అవస్థలు

కాకతీయ యూనివర్సిటీలో 2013-14లో ప్రారంభమైన మహిళా ఇంజినీరింగ్ కాలేజీకి ఇప్పటికీ హాస్టల్ లేకపోవడంతో మొదటి సంవత్సరం 500 మంది విద్యార్థినులు ప్రైవేట్ హాస్టళ్లలో ఉండాల్సి వస్తోంది. అధిక ఫీజులు, ల్యాబ్ సౌకర్యాల లేమి, రెగ్యులర్ ఫ్యాకల్టీ నియామకాలు జరగకపోవడం విద్యార్థినుల ఆవేదనకు కారణమైంది. పలుమార్లు వినతులు చేసినా యూనివర్సిటీ స్పందించకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
News November 24, 2025
TODAY HEADLINES

* వ్యవసాయ నిధి ఏర్పాటు అత్యవసరం: మోదీ
* సింధ్ మళ్లీ INDలో కలవొచ్చు: రాజ్‌నాథ్
* AP: తీవ్ర అల్పపీడనం.. పలు జిల్లాల్లో వర్షాలు
* సత్యసాయి సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి: CBN
* బాబా ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకోవాలి: రేవంత్
* ‘రైతన్నా.. మీకోసం’ పబ్లిసిటీ స్టంటే: జగన్
* అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి వస్తా: VSR
* రేషన్‌కార్డు ఉన్న మహిళలకు ఫ్రీగా చీరలు: పొన్నం
* SAతో ODI సిరీస్‌కు కెప్టెన్‌గా కేఎల్


