News March 3, 2025

రాజస్థాన్ విద్యుత్ శాఖతో సింగరేణి ఒప్పందం

image

TG: సింగరేణి వ్యాపార విస్తరణలో మరో ముందడుగు పడింది. రాజస్థాన్ విద్యుత్ శాఖతో 3,100 మెగావాట్ల ప్రాజెక్టులపై సింగరేణి ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు 1,600 మె.వా. థర్మల్, 1,500 మె.వా. సోలార్ విద్యుదుత్పత్తికి రాజస్థాన్‌ వెళ్లిన Dy.CM భట్టి విక్రమార్క, ఆ రాష్ట్ర CM భజన్‌లాల్ శర్మ సమక్షంలో MOU జరిగింది. ఈ జాయింట్ వెంచర్‌లో సింగరేణి 74%, రాజస్థాన్ 26% చొప్పున ఖర్చులు, లాభాలు పంచుకోనున్నాయి.

Similar News

News March 3, 2025

రేపు TDP కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు రేపు మంగళగిరిలోని TDP కేంద్ర కార్యాలయానికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా నామినేటెడ్ పదవులు, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై నేతలతో చర్చించనున్నారు. ఈ నెలాఖరులోగా నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని ఆయన ఇటీవల చెప్పిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. తమపక్కన తిరిగే వారికి కాకుండా పార్టీ కోసం పనిచేసే వారిని నామినేటెడ్ పదవులకు సూచించాలని MLAలను CM ఆదేశించిన విషయం తెలిసిందే.

News March 3, 2025

రోహిత్‌పై వ్యాఖ్యలా.. దేశం వదిలిపోండి: యువరాజ్ తండ్రి

image

రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేసిన షామా మహమ్మద్‌పై భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ మండిపడ్డారు. ‘దేశానికి గర్వకారణమైన వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్లు సిగ్గుపడాలి. వారికి మన దేశంలో బతికే హక్కు లేదు. క్రికెట్ మా మతం. ఇలాంటి మాటల్ని సహించేది లేదు. నేనే ప్రధానమంత్రినైతే ఆమెను వెంటనే బ్యాగ్ సర్దుకుని దేశం విడిచిపొమ్మని ఆదేశించి ఉండేవాడిని’ అని పేర్కొన్నారు.

News March 3, 2025

కల్తీ నెయ్యి కేసు నిందితులకు మరోసారి కస్టడీ

image

AP: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులు పొమిల్ జైన్, అపూర్వ చావడాకు మరోసారి మూడు రోజుల పోలీస్ కస్టడీకి తిరుపతి రెండో అదనపు మున్సిఫ్ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో రేపటి నుంచి మూడు రోజుల పాటు సిట్ అధికారులు నిందితులను విచారించనున్నారు. ఇటీవల ఈ కేసులో నలుగురు నిందితులను సిట్ ఐదు రోజుల పాటు ప్రశ్నించిన విషయం తెలిసిందే.

error: Content is protected !!