News June 15, 2024
పవన విద్యుత్ ఉత్పత్తిపై సింగరేణి ఫోకస్
TG: పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని సింగరేణి సంస్థ నిర్ణయించింది. ఇందుకోసం సంస్థ పరిధిలోని ఉపరితల గనుల మట్టిదిబ్బలు, కొండలు, గుట్టలపై గాలిమరలు ఏర్పాటు చేయనుంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఇలాంటి ప్లాంట్లపై అధ్యయనం చేస్తోంది. గాలిమరల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలేవి? వాటిని ఏ దిశలో అమర్చాలి? వాటితో ఎంత విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు? వంటి అంశాలపై మెస్సర్స్ పీఈసీ(ఢిల్లీ) సంస్థతో రీసెర్చ్ చేయిస్తోంది.
Similar News
News December 26, 2024
గ్రూప్-1పై దాఖలైన అన్ని పిటిషన్ల కొట్టివేత
TG: గ్రూప్-1 పరీక్షకు సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. జీఓ నంబర్ 29, రిజర్వేషన్ అంశాలపై అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వాదోపవాదాల అనంతరం వారి పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు హైకోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. దీంతో గ్రూప్-1 ఫలితాల విడుదలకు మార్గం సుగమమైంది.
News December 26, 2024
కోడలు శోభిత గురించి నాగార్జున ఏమన్నారంటే?
నాగ చైతన్యతో శోభిత ధూళిపాళ పరిచయం కంటే ముందే తనకు ఆమె తెలుసని నాగార్జున చెప్పారు. ఆమె ఎంతో కష్టపడి ఈస్థాయికి వచ్చారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తన కోడలి వ్యక్తిత్వం, పనిలో నిజాయితీని కొనియాడారు. ఆమె వర్క్‌లో క్వాంటిటీ కంటే క్వాలిటీని చూస్తారన్నారు. ఆమె ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారన్నారు. ‘చైతూ జీవితంలోకి శోభిత వచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నా. వారిద్దరూ ఎంతో ఆనందంగా ఉన్నారు’ అని పేర్కొన్నారు.
News December 26, 2024
టాలీవుడ్‌ను రేవంత్ టార్గెట్‌గా చేసుకున్నారు: అమిత్ మాలవీయ
CM రేవంత్ రెడ్డిపై BJP IT సెల్ చీఫ్ అమిత్ మాలవీయ తీవ్ర విమర్శలు గుప్పించారు. తన అదుపాజ్ఞల్లో ఉండనందుకు, డబ్బు ఇవ్వనందుకు తెలుగు సినీ పరిశ్రమపై రేవంత్ కక్షగట్టారని మండిపడ్డారు. ‘రేవంత్ నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ సర్కారు టాలీవుడ్‌ను లక్ష్యంగా చేసుకుంది. తెలుగు స్టార్లు, నిర్మాతలపై ప్రతీకారం తీర్చుకుంటోంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రేవంత్ సర్కారు చెడ్డపేరును మూటగట్టుకుంది’ అని విమర్శించారు.