News March 16, 2024
బీజేపీలోకి గాయని అనురాధ పౌడ్వాల్

ఒకప్పటి ప్రముఖ గాయని అనురాధ పౌడ్వాల్ ఈరోజు బీజేపీలో చేరారు. సనాతన ధర్మంతో లోతుగా అనుబంధం కలిగిన రాజకీయ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని, ఇది తన అదృష్టమని ఆమె తెలిపారు. ఆలయాల్లో వినిపించే ఓం జయ జగదీశ హరే, శివామృత వాణి, సాయి మహిమ వంటి భక్తిగీతాలతో పాటు 80, 90వ దశకాల్లో బాలీవుడ్లో అనేక సూపర్ హిట్ సాంగ్స్ ఆమె ఆలపించారు.
Similar News
News March 30, 2025
సవతి తల్లి కర్కశత్వం.. పిల్లాడిని గోడకేసి కొట్టడంతో

AP: గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త మొదటి భార్య కవల కుమారులను రెండో భార్య లక్ష్మి తీవ్రంగా హింసించింది. గోడకేసి కొట్టడంతో తల పగిలి చిన్న కొడుకు కార్తీక్(6) మృతి చెందాడు. పెద్ద కుమారుడు ఆకాశ్‌కు రక్తం వచ్చేలా వాతలు పెట్టింది. ప్రస్తుతం అతను తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో భర్త సాగర్, లక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News March 30, 2025
‘ఎంపురాన్’పై మోహన్‌లాల్ క్షమాపణలు

‘ఎల్2 ఎంపురాన్’లో కొన్ని సన్నివేశాలు ఓ వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో మోహన్‌లాల్ క్షమాపణలు చెప్పారు. ‘మా సినిమాలోని కొన్ని కొంతమందికి మనస్తాపం కలిగించాయని తెలిసింది. నా చిత్రాలు ఎవరినీ నొప్పించకుండా చూసుకోవడం ఓ కళాకారుడిగా నా విధి. ఎంపురాన్ కారణంగా మానసిక వేదన అనుభవించిన అందరికీ నా క్షమాపణలు. మీ ప్రేమ కంటే మోహన్‌లాల్ ఎక్కువ కాదు’ అని పేర్కొన్నారు.
News March 30, 2025
ఆహారంలో బొద్దింక, ఎలుక.. 2 వేల శాఖల్ని మూసేసిన హోటల్

జపాన్‌లో అతి పెద్ద రెస్టారెంట్ చెయిన్‌గా పేరున్న సూకియా తమకు చెందిన 2వేల హోటల్ శాఖల్ని తాత్కాలికంగా మూసేసింది. ఆహారంలో ఎలుక, బొద్దింక రావడంతో హోటల్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. షేర్ విలువ పతనమైంది. ఈ నేపథ్యంలో సూకియా కస్టమర్స్‌కు క్షమాపణలు చెప్పింది. అన్ని రెస్టారెంట్లను మూసేసి పూర్తిగా పరిశుభ్రం చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు తాజాగా క్లీనింగ్ స్టార్ట్ చేసింది.