News November 14, 2024
సింగర్ రాజు ఎందరికో స్ఫూర్తి: సజ్జనార్

ఆర్టీసీ బస్సులో పాట పాడి వైరలయిన <<14578057>>దివ్యాంగ సింగర్<<>>ను TGSRTC ఎండీ సజ్జనార్ కలిసి అభినందించారు. ‘దృఢమైన సంకల్పం, సాధించాలనే పట్టుదల ఉంటే వైకల్యం ఏ మాత్రం అడ్డుకాదని గాయకుడు రాజు నిరూపిస్తున్నారు. మధురమైన గాత్రమే కాదు.. పాటకు అనుగుణంగా ఎలాంటి వాయిద్యాల్లేకుండా తన చేతులు, కాళ్లతో సంగీతాన్ని అందిస్తోన్న ఈయన ప్రతిభ అద్భుతం. ఎంతో మంది యువతకు రాజు ఆదర్శనీయం, స్ఫూర్తిదాయకం’ అని పేర్కొన్నారు.
Similar News
News July 10, 2025
బ్యాటరీ సైకిల్ రూపొందించిన విద్యార్థికి పవన్ అభినందనలు

AP: బ్యాటరీ సైకిల్ రూపొందించిన విజయనగరం ఇంటర్మీడియట్ విద్యార్థి రాజాపు సిద్ధూను Dy.CM పవన్ కళ్యాణ్ అభినందించారు. SM ద్వారా అతడి ఆవిష్కరణ గురించి తెలుసుకుని మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించారు. అతడిని బ్యాటరీ సైకిల్‌పై ఎక్కించుకుని ఆయన స్వయంగా నడిపారు. భవిష్యత్తులో సరికొత్త ఆలోచనలు చేయాలని ఆకాంక్షిస్తూ ప్రోత్సాహకంగా రూ.లక్ష అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను Dy.CMO రిలీజ్ చేసింది.
News July 9, 2025
27వ అంతర్జాతీయ పురస్కారం అందుకున్న మోదీ

నమీబియా పర్యటనలో ఉన్న PM మోదీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం దక్కింది. ‘ఆర్డర్ ఆఫ్ ది ఏన్షియంట్ వెల్విట్షియా మిరాబిలిస్’ పురస్కారాన్ని నమీబియా అధ్యక్షురాలు నెతుంబో నంది ప్రధానికి అందజేశారు. 2014లో PM అయినప్పటి నుంచి మోదీకి ఇది 27వ అంతర్జాతీయ అవార్డు. 5దేశాల పర్యటనలో భాగంగా ఆయన ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్ దేశాల్లో పర్యటించి ఆ దేశాల పురస్కారాలు అందుకున్న విషయం తెలిసిందే.
News July 9, 2025
మైనింగ్ బ్లాక్‌పై ఫిర్యాదులు.. స్పందించిన పవన్

AP: విజయనగరంలో దేవాడ మైనింగ్ బ్లాక్ విషయంలో ఫిర్యాదులు వెల్లువెత్తడంపై Dy.CM పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా మాంగనీస్ తవ్వకాలు జరుపుతున్నట్లు ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చిన అభ్యంతరాలను పరిగణించలేదని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. దీంతో ఆ జిల్లా అధికారులతో పవన్ చర్చించారు. మైనింగ్‌కు సంబంధించి పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు.