News January 10, 2025
మహా కుంభమేళాలో గాయకుల ప్రదర్శనలు
ఈనెల 13 నుంచి ప్రారంభంకానున్న మహా కుంభమేళాకు UP సర్కార్ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. భక్తులను అలరించేందుకు గాయకులతో పాటలు పాడించనుంది. శంకర్ మహదేవన్, హరిహరణ్, షాన్ ముఖర్జీ, కైలాశ్ ఖేర్, కవితా కృష్ణమూర్తి, కవితా సేథ్, మాలిని అవస్తీ తదితర కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. మరోవైపు సీఎం యోగి ఆదిత్యనాథ్ నిన్న మేళా ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దని అధికారులను ఆదేశించారు.
Similar News
News January 10, 2025
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హైకోర్టులో షాక్
AP: పోక్సో కేసుకు సంబంధించి వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. బాలికపై అత్యాచారం జరిగినట్లు అసత్య ప్రచారం చేశారని ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన పిటిషన్ వేయగా హైకోర్టు కొట్టివేసింది.
News January 10, 2025
సంక్రాంతి బస్సులపై ఇక్కడిలా.. అక్కడలా!
సంక్రాంతికి APSRTC 7,200, TGSRTC 6,432 బస్సులు నడుపుతున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం స్పెషల్ బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయట్లేదని స్పష్టం చేసింది. ప్రైవేట్ బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే ఉండేలా చర్యలు తీసుకుంటామంది. అటు, TGSRTC స్పెషల్ సర్వీసుల్లో 50% వరకు అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ప్రకటించడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ సర్వీసుల వైపే మొగ్గుచూపే అవకాశం ఉంది.
News January 10, 2025
ఇంటర్ విద్యార్థి.. స్కూళ్లకు 23 సార్లు బాంబు బెదిరింపులు
ఢిల్లీలోని పలు పాఠశాలలకు ఇటీవల వచ్చిన 23 బాంబు బెదిరింపులను ఓ క్లాస్ 12 విద్యార్థి పంపినట్టుగా పోలీసులు నిర్ధారించారు. గతంలోనూ అనేక బెదిరింపు సందేశాలు పంపినట్టు సదరు విద్యార్థి అంగీకరించాడని డీసీపీ సౌత్ అంకిత్ చౌహాన్ తెలిపారు. పరీక్షలు రాయకుండా తప్పించుకోవడానికే ఈ దుశ్చర్యలకు పాల్పడినట్టు పేర్కొన్నారు. స్కూళ్లకు సెలవు ప్రకటించి పరీక్షలు రద్దు చేస్తారని భావించినట్లు చెప్పారు.