News March 17, 2024
త్వరలో ఒకే కేవైసీ విధానం?

ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టార్లో ఒకే KYC విధానాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం బ్యాంకు ఖాతాల నుంచి ఇన్సూరెన్స్ పాలసీల కొనుగోలు వరకు ఆయా సంస్థలకు KYC సమర్పించాల్సి వస్తోంది. అడ్రస్, ఫోన్ నంబర్ మారినా మళ్లీ మార్పులు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వినియోగదారుల వివరాలన్నీ లభ్యమయ్యే ఒకే KYC విధానాన్ని తేవాలని ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ ప్రతిపాదించింది.
Similar News
News April 5, 2025
బాబుతో కలిసి షర్మిల డైవర్షన్ పాలిటిక్స్: అంబటి

AP: సీఎం చంద్రబాబుతో కలిసి PCC చీఫ్ షర్మిల డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. జగన్ను దెబ్బ తీయడానికే షర్మిలతో మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. ‘చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాష్ట్రానికి అన్యాయమే జరుగుతుంది. హోదా తీసుకురాలేదు. పోలవరాన్ని సర్వనాశనం చేశారు. లోకేశ్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకే కేంద్రంతో లాలూచీ పడుతున్నారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.
News April 5, 2025
ఏప్రిల్ 5: చరిత్రలో ఈరోజు

1908: స్వాతంత్ర్య సమరయోధుడు బాబూ జగ్జీవన్ రామ్ జననం
1950: త్రైత సిద్ధాంత ఆదికర్త ప్రబోధానంద యోగీశ్వరులు జననం
1892: తెలుగు కవి పూతలపట్టు శ్రీరాములు రెడ్డి జననం
1942: తెలుగు సినీ నిర్మాత, దర్శకుడు క్రాంతి కుమార్ జననం
1993: నటి దివ్య భారతి మరణం
1974: ప్రముఖ సంగీత దర్శకుడు కోదండపాణి మరణం
News April 5, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.