News November 30, 2025
SIR గడువు పొడిగింపు

ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) షెడ్యూల్‌లో ఈసీ మార్పులు చేసింది. వెస్ట్ బెంగాల్, తమిళనాడు, యూపీ సహా 12 రాష్ట్రాలు/యూటీల్లో SIR గడువును వారం రోజులు పొడిగించింది. డిసెంబర్ 4 చివరి తేదీ కాగా, 11వ తేదీకి పెంచింది. ఆయా రాష్ట్రాల్లో డిసెంబర్ 16న సవరించిన డ్రాఫ్ట్ లిస్ట్ విడుదల కానుంది. డిసెంబర్ 16-ఫిబ్రవరి 7 మధ్య అభ్యంతరాలను పరిష్కరించి ఫిబ్రవరి 12న తుది లిస్ట్‌ను ఈసీ ప్రకటించనుంది.
Similar News
News April 1, 2026
భారీగా పెరిగిన బంగారం ధర.. కారణం ఇదే

పశ్చిమాసియాలో ఘర్షణలు తగ్గొచ్చనే అంచనాలు, బ్యాంకులు వడ్డీ రేట్లను సవరించవనే నమ్మకంతో బంగారం, వెండికి డిమాండ్ పెరిగింది. దీంతో మళ్లీ ధరలు పెరుగుతున్నాయి. ఇవాళ రెండుసార్లు రేట్లు ఎగిశాయి. HYD బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ఏకంగా ₹3,440 పెరిగి ₹1,52,950 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹3,150 పెరిగి ₹1,40,200కు చేరింది. ఇక కేజీ వెండి ధర ₹2,65,000గా ఉంది.
News April 1, 2026
ధురంధర్-2: పుష్ప-2, బాహుబలి-2 రికార్డులు బ్రేక్ అవుతాయా?

‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. 14 రోజుల్లోనే ₹1,435 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. త్వరలోనే ₹1,500 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగానే కనిపిస్తోంది. అయితే పుష్ప-2 నెలకొల్పిన ₹1,800 కోట్ల రికార్డును మాత్రం బ్రేక్ చేయడం ఈ సినిమాకు పెద్ద టాస్కే. ఇక బాహుబలి-2 పేరిట ఉన్న ₹2,000 కోట్ల రికార్డును అందుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో అసాధ్యమని విశ్లేషకులు చెబుతున్నారు.
News April 1, 2026
పెరగనున్న మారుతీ కార్ల ధరలు!

తమ కార్ల ధరలు పెరిగే అవకాశం ఉందని మారుతీ సుజుకీ ప్రకటించింది. పశ్చిమాసియా యుద్ధం వల్ల కమొడిటీ ధరలు పెరగడం, గతేడాది GST తగ్గింపు వల్ల వచ్చిన లాభాలు తుడిచిపెట్టుకుపోవడమే అందుకు కారణమని వివరించింది. కార్ల తయారీలో వాడే ఆయిల్, గ్యాస్ సహా కీలక లోహాల ధరలు పెరిగినట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు సప్లైలో ఎలాంటి అడ్డంకులు లేనప్పటికీ.. రాబోయే రోజుల్లో ఉండొచ్చని అంచనా వేసింది.


