News December 19, 2025

SIR: నేడు తమిళనాడు, గుజరాత్ లిస్ట్స్ విడుదల

image

ఓటర్ లిస్ట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో భాగంగా తమిళనాడు, గుజరాత్ ఓటర్ల జాబితాను ECI కాసేపట్లో విడుదల చేయనుంది. ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో బెంగాల్ తరహాలో అభ్యంతరాల స్వీకరణకు నెల రోజుల గడువు మాత్రమే ఇచ్చే అవకాశముంది. కాగా ఇటీవల SIR పూర్తైన బెంగాల్‌లో 58 లక్షల ఓట్లు, రాజస్థాన్: 42L, గోవా: 10L, పుదుచ్చేరి: లక్ష, లక్షద్వీప్: 1500 ఓట్లను తొలగించారు.

Similar News

News December 21, 2025

హనుమంతుడి కన్నా గొప్ప దౌత్యవేత్త ఎవరు?: జైశంకర్

image

శ్రీకృష్ణుడు, హనుమంతుడు గొప్ప దౌత్యవేత్తలని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. ‘సీత సమాచారం కోసం హనుమ శ్రీలంకకు వెళ్లాడు. సమాచారం తెలుసుకుని, సీతమ్మను కలిసి మనోధైర్యం నింపాడు. రావణుడిని మానసికంగా ఓడించగలిగాడు. ఇంతకన్నా గొప్ప దౌత్యవేత్త ఎవరు? ఒక పని చెబితే 10 పనులు పూర్తిచేశాడు. అలాంటి వ్యక్తి గురించి ప్రపంచానికి తెలియజేయకపోతే మన సంస్కృతికి అన్యాయం చేసినట్లే’ అని పుణే బుక్ ఫెస్టివల్‌లో అన్నారు.

News December 21, 2025

INDvsPAK.. భారత్ ఫస్ట్ బౌలింగ్

image

పాకిస్థాన్‌తో జరుగుతోన్న అండర్-19 మెన్స్ ఆసియా కప్‌ ఫైనల్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

IND: ఆయుశ్ మాత్రే (C), వైభవ్, ఆరోన్ జార్జ్, విహాన్, వేదాంత్, అభిజ్ఞాన్ కుందు, కనిష్క్, ఖిలాన్, దీపేశ్, కిషన్ కుమార్ సింగ్, హెనిల్

☛ సోనీ స్పోర్ట్స్, సోనీలివ్ యాప్‌లో లైవ్ చూడవచ్చు.

News December 21, 2025

‘రాజాసాబ్’ సినిమా బిజినెస్‌పై నిర్మాత క్లారిటీ

image

‘రాజాసాబ్’కు ఆశించిన దానికంటే తక్కువ ధరకు OTT డీల్ జరిగిందని నిర్మాత విశ్వప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వైరలయ్యాయి. దీనిపై ఆయన Xలో స్పందించారు. ‘మేము ప్రొడక్షన్ ఖర్చులను బయటపెట్టం. మాకు, ఫ్యాన్స్‌కు థియేటర్ ఇంపాక్టే ముఖ్యం. రిలీజ్ తర్వాత స్క్రీన్లే మాట్లాడతాయి. కలెక్షన్లను అధికారికంగా ప్రకటిస్తాం. ఈ మూవీకి వచ్చిన నాన్-థియేట్రికల్ వాల్యూయే ప్రస్తుత మార్కెట్‌లో హైయెస్ట్’ అని పేర్కొన్నారు.